ఎప్పుడు ఏదో వివాదాలలో ఉంటారు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ప్రపంచమంతా ఒకలా మాట్లాడితే రాంగోపాల్ వర్మ మరో అలా మాట్లాడి చాలా వింతగా వెరైటీగా ప్రవర్తిస్తుంటారు. రాంగోపాల్ ప్రవర్తనపై చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారని ఆయన ప్రవర్తన కు చాలా మంది అభిమానులు కూడా ఉండటం విశేషం. అయితే గత రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో వర్మ  హడావిడి అంతా ఇంతా కాదు.


ఎందుకంటే ఆయన శిష్యుడు పూరి జగన్నాథ్ తీసిన “ఇస్మార్ట్ శంకర్” సినిమా చూసి వర్మ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.ఈ సినిమా చూసి తాను పిచ్చోడిని కాదు కానీ ఇస్మార్ట్ శంకర్ సినిమా నన్ను అలా మార్చేసింది అని ఒక వీడియో పెట్టి షాంపైన్ తో చేసిన హంగామా అంతా ఇంతా కాదు.ఇప్పుడు ఇదే వీడియోతో మరో వీడియో తయారు చేసి వదిలారు.ఇది చూసాక నిజంగానే వర్మకు పిచ్చి పట్టేసిందని మెంటల్ ఏమైనా ఉందా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


చంద్రముఖి సినిమాలోని రజిని కాంత్, ప్రభుతో కలిసి పూర్తిగా చంద్రముఖిలా మారిన గంగను చూడు అనే సీన్ ను పెట్టి వారు చేసుకున్న “ఇస్మార్ట్ శంకర్” సక్సెస్ వేడుకలకు రజిని రియాక్షన్ ఎలా ఉందో చూడండి అంటూ ఒక ట్వీట్ పెట్టేసారు. వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: