బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ మొదలైంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే కంటెస్టంట్స్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రచారంలో ఉన్న కొందరు ఊహించని వారు మరికొందరు ఇలా చివరి నిమిషంలో బిగ్ బాస్ సీజన్ 3 సర్ ప్రైజ్ చేసింది.


కేవలం సినిమా వాళ్లే అయితే ఎలా అనుకున్నారో ఏమో ఈసారి బుల్లితెర సెలబ్రిటీస్ మీద దృష్టి పెట్టారు బిగ్ బాస్ నిర్వాహకులు. సీరియల్ యాక్టర్స్, యాంకర్స్ తో పాటుగా ఫన్ బకెట్ అంటూ తన కామెడీతో అలరించి సినిమాల్లో బిజీ అయిన కమెడియన్ మహేష్ విట్టా కూడా బిగ్ బాస్ కంటెస్టంట్ గా వచ్చాడు.


తనదైన డైలాగ్ డెలివరీతో మహేష్ తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నాడు. టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వస్తాయన్న దానికి పర్ఫెక్ట్ ఎక్సాంపుల్ మహేష్ విట్ట. ఫన్ బకెట్ తో వచ్చిన క్రేజ్ తో సినిమాలు చేస్తున్న మహేష్ విట్టాకి బిగ్ బాస్ కంటెస్టంట్ గా లక్కీ ఛాన్స్ వచ్చింది. తన పంచులతో అలరించే మహేష్ విట్ట బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టంట్స్ ను ఎలా అలరిస్తాడో చూడాలి. చూపు చమత్కారం.. మాట వెటకారం.. డిజిటల్ మీడియా స్టార్ గా ఎదిగిన మహేష్ ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టంట్ గా వచ్చాడు.. రాయలసీమ బిడ్డగా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు మహేష్ విట్ట.    
      


మరింత సమాచారం తెలుసుకోండి: