సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న తెలుగు సినిమాకు ఇస్మార్ట్ శంకర్ రూపంలో మాంచి మసాలా హిట్ దొరికింది. ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే 36 కోట్ల వసూలు చేసిందన్న టాక్ ఆశ్చర్యానికిలోను చేస్తోంది. అటు హీరో రామ్ కు, దర్శకుడు పూరీకి సరైన సమయంలో మంచి హిట్ దొరికింది.


అయితే ఈ సినిమా హిట్ అయినా హీరో రామ్ కు ఇప్పుడు పెద్దగా సంతోషం లేకుండా పోయింది. ఇస్మార్ట్ శంకర్ బంపర్ హిట్ దిశగా దూసుకెళ్తున్నా ఆ క్రెడిట్ అంతా పూరీ జగన్నాథ్ ఖాతాలోకే వెళ్తోంది. కొన్నాళ్లుగా వరుస ప్లాపులతో విసిగిపోయిన పూరీకి ఈ సినిమా పునర్ వైభవం అందిస్తోంది.


దాదాపు ఇదే పరిస్థితి హీరో రామ్ కు కూడా కానీ.. ఈ సినిమా విజయం విషయంలో రామ్ కు ఆ క్రెడిట్ దక్కుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ సినిమా కోసం రామ్ కూడా చాలా కష్టపడ్డాడు. లుక్, గెటప్ అంతా మార్చేశాడు. తెలంగాణ భాష కూడా కష్టపడి పలికాడు..


కానీ పాపం సినీ జనం ఇవేమీ పెద్దగా పట్టించుకోవడం లేదు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ను పొగడ్తలతో ముంచెత్తడంతోనే సరిపెట్టుకుంటున్నారు. దీంతో సినిమా హిట్ అయినా.. ఆ క్రెడిట్ దక్కక రామ్ కాస్త అసంతృప్తితో ఉన్నట్టు కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: