మజిలీ సినిమాలో  క్రికెటర్ చైతుకు జోడిగా నటించి మెప్పించింది బాలీవుడ్ బ్యూటీ దివ్యాంశ  కౌశిక్.   నార్త్ ఇండియన్ అమ్మాయిగా తన స్క్రీన్ ప్రెజెన్స్  తో  పాటుగా తన నటనతోనూ ఈ అమ్మడు బాగా ఆకట్టుకుంది.  కానీ  మజిలీలో హీరోయిన్ గా  క్రెడిట్ మొత్తం సమంతకే వెళ్ళిపోయింది. దాంతో  దివ్యాంశకు  రావాల్సిన స్థాయిలో  స్టార్ డమ్ రాకపోవడంతో  ఆమెకు పెద్దగా ఆఫర్స్ కూడా రావట్లేదు.  మజిలీ టీం మొత్తం తమ తరువాత సినిమా పై దృష్టి పెడితే.. ఈ భామ మాత్రం సినిమా ఆఫర్ కోసం ఇంకా ఎదురుచూస్తూ ఉంది.  


మజిలీలో  తన పాత్రలో అద్భుతంగా  నటించినా   ఛాన్స్ లు ఎందుకు రావట్లేదో పాపం.  మొత్తానికి దివ్యంశ కౌశిక్ పరిస్థితి..   సినిమా భారీ హిట్.. తాను మాత్రం ఫట్ మాదిరిగా తయారయింది. ఒకపక్క సరైన హిట్ లేని నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్లు మంచి ఆఫర్స్ పట్టుకుంటుంటే.. హిట్ సినిమాలో మెయిన్ లీడ్ గా చేసి కూడా   దివ్యంశ కౌశిక్ ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది.  కనీసం  నాగ చైతన్య అన్నా .. లేక  దర్శకుడు శివ నిర్వాణనైనా తమ తరువాత సినిమాల్లో ఛాన్స్ లు ఇస్తారేమో చూడాలి.     


మరింత సమాచారం తెలుసుకోండి: