డైరెక్టర్ సంపత్ నందికి కామెడీ రాయడంలో మంచి పట్టు ఉంది. అయితే  సంపత్ నంది  ఇప్పటికే  కళ్యాణ్ రామ్ కోసం ఓ మంచి కామెడీ  ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా  పట్టాలెక్కెనున్నట్లు తెలుస్తోంది.  అయితే పటాస్ తరువత కామెడీ చిత్రాలు  పెద్దగా చేయని కళ్యాణ్ రామ్, సంపంత్ నంది  సినిమాలో  మాత్రం పక్కా కామెడీ అంశాలు హైలెట్ అయ్యే విధంగా సినిమాని చేయనున్నాడట. మరి  కళ్యాణ్ రామ్ కామెడీ చేయగలడా ? ఎక్కువుగా సీరియస్ పాత్రలు చేసే కళ్యాణ్ రామ్   ఫుల్ ఎంటర్ టైనర్ లో ఫుల్ కామెడీ రోల్ లో ఇంతవరకూ చెయ్యలేదు. 


సపంత్ నంది సినిమాలో ఫుల్ ఫన్ రోల్ ను  కళ్యాణ్ రామ్ మొదటిసారి ట్రై చేస్తోన్నాడు.  సపంత్ నంది కూడా  హీరో  పాత్రను  చాలా వైవిధ్యంగా మలిచారని...   సినిమా మొత్తం మీద కళ్యాణ్ రామ్  పాత్రలో చాలా వేరియేషన్స్ ఉండేలా చూసుకున్నారని తెలుస్తోంది.   ఆ పాత్రలోని  వేరియేషన్స్ వల్లే  సినిమాలో  కామెడీ సీక్వెన్స్  హైలెట్ గా నిలుస్తాయట.  మరి కళ్యాణ్ రామ్ - సంపత్ నంది కాంబినేషన్ లో వస్తోన్న  ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కి  మంచి  హిట్ ఇస్తోందా...  చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: