ఒకప్పుడు ఇండియన్ సినిమా అనగానే అందరు బాలీవుడ్ వైపు చూసేవారు కానీ ఇప్పుడు బాలీవుడ్ నటులు కూడా ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమాల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ అందగత్తెలు మన హీరోల మీద మనసు పారేసుకుంటున్నారు.

ఒకప్పుడు మహేష్ లాంటి హీరో మా ఇండస్ట్రీలో ఉంటే బాగుండు అని మలైకా అరోరా అన్న సంగతి మనకు తెలిసిందే, మొన్నటికి మొన్న నీకు ఇప్పటి హీరోల్లో ఎవరంటే ఇష్టం అని జాహ్నవి కపూర్ ని అడగ్గానే టక్కున చెప్పిన పేరు మన తెలుగు కుర్రాడు విజయ్ దేవరకొండ. మనవాళ్ళు బాలీవుడ్ బ్యూటీ ల మీద అంతలా ప్రభావం చూపిస్తున్నారు.

ఇప్పుడు కొత్తగా ఆ లిస్ట్ లోకి ఇంకో స్టార్ హీరో కూడా చేరిపోయారు, వీర్ సినిమా హీరోయిన్ జరీన్ ఖాన్ మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డాన్స్ చూసి ఫిదా అయ్యిందట, "అసలు అల్లు అర్జున్ అలా ఎలా డాన్స్ చేస్తారు. ఎంత పెద్ద మూమెంట్ ని అయిన చాలా సునాయాసంగా ఆయన చేసేస్తున్నారు". నిజంగా సౌత్ హీరోలు నన్ను ఎప్పటికప్పుడు తమ టాలెంట్ తో పడేస్తున్నారు అని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: