90వ దశకంలో నాగార్జున గ్లామర్ ను ఎవరూ అంత తేలికగా మర్చిపోరు. హలోబ్రదర్, నిన్నేపెళ్లాడతా.. సినిమాల్లో నాగ్ హ్యాండ్సమ్ లుక్ కి అప్పట్లో అమ్మాయిలు ఫిదా అయిపోయేవారు. అంత గ్లామర్ గాఉండేవాడు. నిన్నేపెళ్లాడతాలో గ్రీకువీరుడు.. నా రాకుమారుడు అనే పల్లవికైనా, మన్మధుడు అనే టైటిల్ కైనా పర్ఫెక్ట్ గా న్యాయం చేసాడు నాగార్జున. వయసు పెరుగుతున్నా తనలో గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు.

 

నాగ్ నటించిన మన్మథుడు-2 సినిమా రిలీజ్ కు దగ్గర పడుతోంది. ఇటివల రిలీజైన టీజర్ కు విపరీతమైన స్పందన వచ్చింది. నాగార్జున హ్యాండ్సమ్ లుక్ కి ఎంత అప్లాజ్ వచ్చిందో సినిమాలో నాగ్ క్యారెక్టర్ పై అన్ని విమర్శలూ వచ్చాయి. కానీ సినిమాపై అంచనాలు మాత్రం పెరిగిపోయాయి. తాజాగా సినిమాలో ”హే మెనీనా..” అంటూ సాగే పాట లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. నాగార్జున ఫ్రెష్ నెస్ లెవల్స్ ఎంతో ఈపాటలో మరోసారి రుజువయింది. అరవైకి దగ్గరపడుతున్నా నాగ్ ఎనర్జీ, ఫిట్ నెస్, గ్లామర్ ఆశ్చర్యం కలిగిస్తాయి. పాటలో చాలా స్టైలిష్ గా ఉన్ననాగార్జున తన కొడుకులకే పోటీ ఇచ్చేంత అందంగా ఉన్నాడు.

 

.”అయినా అంత సులువుగా అమ్మాయిల్ని ఎలా పడేస్తారు సార్” అని వెన్నెల కిశోర్ అడిగితే” పడేయటమేంట్రా.. ఆ మాటంటేనే నాకు చిరాకు” అంటూ నాగార్జున అంటాడు. దీంతో ఈ పాట ద్వారా నాగ్ క్యారెక్టర్ ను కొంచెం పరిచయం చేశారు. ఈపాటలో నాగార్జునను చూస్తే 2003లో వచ్చిన మన్మథుడు టైటిల్ కి ఎంత పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యాడో ఇప్పుడు కూడా మన్మథుడు-2 కి అంతే యాప్ట్ అయ్యేలా ఉన్నాడు. చైతన్య భరద్వాజ్ స్వరపరచిన ఈపాటలో అద్భుతమైన ఫారిన్ లోకేషన్స్ కు నాగార్జున అందం తోడై పాట విసువల్ ఫీస్ట్ గాఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: