ఇండస్ట్రీలో వారసులు చాలా మందే ఉన్నారు. ఈ వారసత్వం గురించి ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని చెబుతుంటారు. అయితే వారసత్వం అనేది సినిమాల్లో ఎంట్రీ వరకే ఉంటుంది. ఆ తర్వాత టాలెంట్ లేకపోతే ఎంత పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చిన నెగ్గుకు రాలేరన్న మాట వాస్తవం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో భవిష్యత్తు సక్సెస్ మీదే ఆధారపడి ఉంటుంది. సక్సెస్ రాకపోతే అవకాశాలు కూడా ఉండవు.


మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికి నటన పరంగా మంచి మార్కులే పడ్డాయి. ఒక తండ్రి కోరిక కోసం కొడుకు పడే కష్టం గురించి చూపించే సినిమా ఇది.  తండ్రి కొడుకుల గురించిన కథ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరవ్వడంలో సక్సెస్ సాధించారనే చెప్పాలి.


విజేత సినిమా తర్వాత కళ్యాణ్ దేవ్ తన రెండో చిత్రం నూతన దర్శకుడు పులివాసు తో ప్రారంభించాడు. ఎప్పుడో లాంచింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ కూడా జరుపుకుంది. అయితే సగభాగం షూటింగ్ జరుపుకున్న తర్వాత ఒకసారి దర్శకుడు సినిమా చూసుకున్నారట. మరి ఏం తప్పులు కనబడ్డయో తెలియదు కానీ మరింత మెరుగులు దిద్దేందుకు సిద్ధమయ్యారట.


 స్క్రిప్ట్ మరియు డైలాగులను ఇంకా పదునుగా ఉండేలా చూసుకుంటున్నాడట. అప్పటి వరకు రాసింది కాక దాన్ని మరింత మెరుగులు దిద్ది సినిమాని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడట. షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి స్క్రిప్ట్ మీద మరింత వర్క్ చేస్తున్నారని సమాచారం. రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: