నాలుగు రోజులలో ‘డియర్ కామ్రేడ్’ మూవీ పై తీర్పు రాబోతోంది. విజయ్ దేవరకొండకు ఉన్న మ్యానియా రీత్యా ఈమూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ వారంరోజులు ముందుగానే ఆన్ లైన్ లో ఓపెన్ అయింది. ఇంత ముందుగా కూడ ఈమూవీ టిక్కెట్లకు జరుగుతున్న బుకింగ్ ను బట్టి ఈమూవీ ఓపెనింగ్స్ విషయంలో రికార్డులు సృష్టించడం ఖాయం అన్న అభిప్రాయం కలుగుతోంది.

ఈఏడాదిలో ఇప్పటివరకు విజయ్ నటించిన సినిమాలు ఏమీ రాకపోవడంతో ఈమూవీ పై యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే ఈమూవీ నిడివి ఈమూవీకి సంబంధించి పెనుసమస్యగా మారుతుందా అన్నసందేహాలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి. ఈమూవీ నిడివి 2గంటల 50నిముషాలకు ఫైనల్ గా లాక్ చేయడంతో ఈమూవీకి సంబంధించి ఇంటర్వెల్ గ్యాప్ తో కలుపుకుని దాదాపు 3 గంటలకు పైగా ప్రేక్షకులు ఈమూవీ ధియేటర్ లో ఉండాలి. 

అయితే ఇంత పెద్ద నిడివితో వచ్చిన విజయ్ ‘అర్జున్ రెడ్డి’ బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ఆమూవీకి ‘డియర్ కామ్రేడ్’ కు ఒక స్పష్టమైన తేడా ఉంది అని ఇన్ సైడ్ టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ ఫస్ట్ హాఫ్ చాలా వేగంగా జరిగిపోతుందట. స్టూడెంట్ యూనియన్లు వాటి రాజకీయాలు వ్యవస్థకు తిరగబడే విద్యార్ధి నాయకుడిగా విజయ్ ప్రస్థానం కొనసాగుతుంది. ఆ తర్వాత రష్మికతో పరిచయం అటు పై ప్రేమ ఇలా ఒక ఫ్లోలో సాగుతుందట. 

కానీ కాలేజీ ఎపిసోడ్స్ సీన్స్ కు సంబంధించి ప్రీ పాజిటివ్ టాక్ ఉంది కానీ ఈమూవీ సెకండ్ హాఫ్ గురించి మాత్రం కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈమూవీ సెకండ్ హాఫ్ లో చాల బరువైన ఎమోషన్స్ తో హెవీ సెంటిమెంట్ తో సీన్స్ ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్థుత తరం ప్రేక్షకులు ఇంత భారీ సెంటిమెంట్ సీన్స్ ను భరించలేకపోతే ఈమూవీకి పెను ప్రమాదం వచ్చే ఆస్కారం ఉంది. దీనితో ఈమూవీ సెకండ్ హాఫ్ ఎలా ఉన్నా ఈసినిమాను పూర్తిగా విజయ్ దేవరకొండ భుజాన్ని పెట్టుకుని నడిపించే సమర్ధతను బట్టి ఈమూవీ సక్సస్ ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: