బిగ్ బాస్ లో ఛాన్స్ రావాలంటే ఒకటి సెలబ్రిటీ అయినా అయ్యుండాలి లేదా సోషల్ మీడియాలో హంగామా అయినా చేసి ఉండాలి. ఏదో ఒకటి చేసి సోషల్ మీడియాలో వైరల్ గా మారితే చాలు వాళ్లకు బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చినట్టే. మొదటి సీజన్ లో కత్తి మహేష్, రెండవ సీజన్ లో దీప్తి సునయన అలా ఛాన్స్ కొట్టేసినవారే.   


ఇక ఈసారి బిగ్ బాస్ సీజన్ 3లో కూడా అలాంటి ఓ సోషల్ మీడియా క్రేజ్ సంపాదించిన అమ్మడిని తీసుకొచ్చారు. ఆమె ఎవరో కాదు పేరు అషు రెడ్డి. అచ్చం సమంతలా ఉండటమే ఆమెకు ప్లస్ అయ్యింది. అంతే ఒకటి రెండు వీడియోలతోనే వైరల్ అయ్యింది. కేవలం సమంతలా ఉండబట్టే అని కాకుండా అమ్మడి టాలెంట్ కూడా చూసి ఆడియెన్స్ ఆమెను ఫాలో అవుతున్నారు. 


ఈ ఫాలోయింగ్ ను చూసే బిగ్ బాస్ కంటెస్టంట్ గా ఎంపిక చేశారు. ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ 3 15 మంది సభ్యులలో అషు రెడ్డి ఒక కంటెస్టంట్ గా వచ్చింది. చాలా క్యూట్ గా బబ్లీగా అనిపిస్తున్న అషు రెడ్డి నిజంగానే సమంత చెల్లెలు అని అంటే ఒప్పుకోవచ్చు. తప్పకుండా బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాకా అషు రెడ్డికి సినిమా ఛాన్సులు వస్తాయి.  


ఇక ఈసారి సీజన్ 3లో స్టార్ సెలబ్రిటీస్ ఎంట్రీ ఇచ్చారు. యాంకర్ శ్రీముఖి, నటి హేమ, తీన్మార్ సావిత్రి, సీరియల్ యాక్టర్ రవి కృష్ణ ఇలా అందరు బుల్లితెర ఆడియెన్స్ కు బాగా తెలిసిన వారే. మరి వీళ్ల ఆట ఎలా సాగుతుందో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: