ఇంతపెద్ద స్టార్ అయినా పబ్లిసిటీ లేకపోతే... అన్ని విషయాల్లో వెనకబడి పోతారు.  టాలెంట్ ఒక్కటే ఉంటె సినిమా ఇండస్ట్రీలో సరిపోదు.  తనను తాను ప్రమోషన్ చేసుకోగలగాలి.  అలా చేసుకున్నప్పుడే ఎవరైనా సరే లైమ్ లైట్ లో ఉంటారు.  అందుకే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో చలాకీగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు.  


బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న అలియా భట్ ఇటీవలే సొంతమా ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది.  ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశ్యం ఆమెను ప్రమోట్ చేసుకోవడమే.  హీరోయిన్ యూట్యూబ్ ఛానల్ అంటే ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు.  


అదే బాటలో ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోయిన్ కూడా చేరబోతున్నది.  ఆమె ఎవరో కాదు జాక్వెలిన్ ఫెర్నాండేజ్.  సల్మాన్ ఖాన్ తో ఎక్కువ సినిమాలు చేసిన ఈశ్రీలంక బ్యూటీ సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టేందుకు సిద్ధం అవుతున్నది.  సొంతంగా ఛానల్ పెట్టి తన ఫిట్నెస్ కు సంబంధించిన విషయాలను అందులో ఉంచాలని అనుకుంటోంది.  


ఫిట్నెస్ తో పాటు తన సినిమా విషయాలను కూడా ఎప్పటికప్పుడు అందులో ఉంచాలని అనుకుంటోంది జాక్వెలిన్.  ప్రభాస్ సాహో సినిమాలో ఓ ఐటెం సాంగ్ లో స్టెప్స్ వేసింది.  ఈ సాంగ్ ను క్రొయోషీయాలో షూట్ చేశారు.  ప్రభాస్ సినిమాతో ఈ అమ్మడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: