హీరోయిన్లను తెరపై అందంగా చూపించడంలో వర్మ సిద్ధహస్తుడు. హీరోలను ఎలా చూపించినా.. వారి విషయంలో మాత్రం చాలాబాగా చూపిస్తాడు. తన మొదటి సినిమా శివ సినిమాలో కూడా అమలను అందంగా చూపించాడు. ఆ తరువాత తనకు అత్యంత ఇష్టమైన శ్రీదేవిని క్షణక్షణం, గోవిందా గోవిందా సినిమాలో ఎంత బాగా చూపించారో చెప్పక్కర్లేదు.
తన సినిమాల్లో హీరోయిన్లను అందంగా చూపిస్తూ ఆకాశానికి ఎత్తేస్తుంటారు. వర్మ తో చేసిన చాలామంది హీరోయిన్లు ఇప్పుడు టాప్ పోసిషన్ లో ఉన్నారు. రంగీలా ఊర్మిళ బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. అమల అప్పట్లో మంచి సినిమాలు చేసింది. బాలీవుడ్ కు కొత్త కొత్త హీరోయిన్లను ఎందరినో పరిచయం చేశాడు.
ఇప్పుడు తన శిష్యుడి హీరోయిన్లను ప్రమోషన్ చేస్తున్నాడు. నిధి, నభా నటేష్ లను ప్రోమోట్ చేస్తున్నాడు. నభా కు మంచి ఫ్యూచర్ ఉందని ట్విట్టర్ లో అదరగొడుతూ పాపులారిటీ పెంచుతున్నాడు. చూస్తుంటే తనకున్న పరిచయాలతో నభాకు బాలీవుడ్ లో అవకాశాలు ఇప్పించే విధంగానే ఉన్నాడు.
నభా పై ప్రత్యేక అభిమానాన్ని వర్మ ఎందుకు చాటుకుంటున్నారు అన్నది తెలియడం లేదు. నభా మంచి టాలెంటెడ్ హీరోయిన్. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఇది రెండో సినిమా మాత్రమే.