సమంత ప్రస్తుతం ఓ బేబీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది. అయితే తన కొత్త సినిమాకు సంభందించిన ఫోటోలు లీక్ అవ్వటంతో సమంత ఒకింత షాక్ కు గురైందని చెప్పాలి. ఓ బేబీ' విడుదలై నెల రోజులు కూడా కాకముందే సమంత మరో సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది. అదే తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96' రీమేక్. ఇందులో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు.


ఈ సినిమాను మాత‌ృకను తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగులోనూ రూపొందిస్తున్నారు. దీన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ సినిమా షూటింగో.. లేక ఫొటో షూటో తెలియదు కానీ, సమంత ఫొటోలు లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో ఇవి వైరల్ అయిపోయాయి. ఇందులో సమంత.. ‘96' తమిళ సినిమాలో త్రిష ఎలా కనిపించిందో.. అదే గెటప్‌లో ఉంది. అంతేకాదు, అచ్చం త్రిషలానే కనిపిస్తోంది. 


ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందుకే ఈ సినిమా రీమేక్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కథలో మార్పులు చేయకుండానే తెలుగులోకి అనువాదం చేస్తున్నారట. అయితే, ఇక్కడి పరిస్థితులకు తగ్గట్లు కొన్ని మార్పులు ఉంటాయని టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: