సినిమాల్లో చిన్న గ్రూప్ డాన్సర్ గా కెరియర్ ప్రార్ంభించి,ఎన్నో కష్టాలు పడి కొరియోగ్రాఫర్ గాఎదిగిన లారెన్స్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.  కొరియోగ్రాఫర్ గా ఎంతో మంది హీరోల చేత స్టెప్పులు వేయించిన లారెన్స్ తాను కూడా హీరోగా మారి దర్శకుడు కూడా అయ్యాడు.  నాగార్జున హీరోగా నటించిన మాస్ సినిమాతో దర్శకుడిగా మారి మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టారు.


ఆ తర్వాత నాగార్జునతో  డాన్, ప్రభాస్ తో రెబల్ సినిమాలు తీశాడు. కొత్తగా హారర్ కామెడీని పరిచయం చేస్తూ ముని చిత్రాన్ని తీశాడు. దీనికి సీక్వెల్ గా వచ్చిన కాంచన ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత గంగ, కాంచన ౩ లాంటి సినిమాలతో వరుస విజయాలు అందుకున్నాడు. ఇటీవల విడుదలైన కాంచన ౩ సినిమా తెలుగు, తమిళంలో మంచి విజయం సాధించింది.


ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనుకునే లారెన్స్ సేవా కార్యక్రమాల్లో ముందుంటాడు. సినిమాల్లో హీరోలానే సమాజంలో కూడా హీరో అనిపించుకుంటున్నాడు. తన తల్లి పేరున ఒక ట్రస్టు  చిన్న పిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్స్ చేయిస్తున్నాడు.  తన సంపాదనలో లారెన్స్ కొంత ఇలా సామాజిక కార్యక్రమాలకి ఉపయోగిస్తాడు.


ఆయన కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ లో తను చేయించిన గుండె ఆపరేషన్స్ లో 156 వది కూడా విజయవంతం అయినదని ఆనందం వ్యక్తం చేశారు. ఖరీదైన గుండె ఆపరేషన్స్ చేయించుకోలేని పిల్లల తల్లి తండ్రులకు లారెన్స్ చేస్తున్న సాయం అభినందనీయం. ప్రస్తుతం లారెన్స్ అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న కాంచన హిందీ రీమేక్ “లక్ష్మీ బాంబ్” చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: