టాప్‌ యంగ్ హీరోల రేసును తప్పిస్తే మిడిల్ రేంజ్ హీరోల రేసులో ఇప్పటి వరకు ప్రధాన పోటీ నాని విజయ్ దేవరకొండల మధ్య మాత్రమే జరుగుతోంది. అయితే గతవారం విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ అనూహ్య విజయం సాధించి కేవలం వీకెండ్ పూర్తి అయ్యే సరికి ఈమూవీకి 20 కోట్ల నెట్ కలక్షన్స్ దాటిపోయాయి అని వస్తున్న వార్తలతో ఒకేసారి రామ్ మ్యానియా పెరిగిపోయి ఇప్పుడు మిడిల్ రేంజ్ హీరోల రేసులో రామ్ కూడ చేరిపోయాడు.

సమ్మర్ రేస్ కు వచ్చిన ‘మజిలీ’ సక్సస్ కావడంతో నాగచైతన్య స్టామినా కూడ బాక్స్ ఆఫీసు వద్ద రుజువు చేయబడి ఇతడు కూడ మిడిల్ రేంజ్ హీరోల రేసులోకి చేరిపోయాడు. వీరితో పాటు వరుణ్ తేజ్ సినిమాలకు కూడ మంచి కలక్షన్స్ వస్తున్న నేపధ్యంలో ఈ రేసులో ఈ మెగా యంగ్ హీరోకు ఛాన్స్ ఉంది అంటున్నారు. 

త్వరలో విడుదల రాబోతున్న ‘వాల్మీకి’ మూవీ పై వరుణ్ తేజ్ కు చాల ఆశలు ఉన్నాయి. ఇక ఇప్పటికే మంచి నటులుగా పేరు తెచ్చుకుని ప్రస్తుతం పరాజయాలతో సతమతమైపోతున్న రామ్ సాయి తేజ్ లు కూడ తాము ఎంచుకునే కథల విషయంలో వైవిధ్యం చూపెడుతూ ఒక భారీ హిట్ కొట్టాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం మిడిల్ రేంజ్ హీరోల మధ్య జరుగుతున్న పోటీ అత్యంత ఆసక్తికరంగా మారింది. మంచి కథలను దర్శకులను ఎంచుకోవడమే కాకుండా తాము నటించే పాత్రల కోసం తమ లుక్ ను మార్చుకుంటూ తమ బాడీ లాంగ్వేజ్ లో మార్పులు చేసుకుంటూ అనుక్షణం పరుగులు తీస్తున్న వీరి తీరుతో ప్రస్తుతం టాప్ యంగ్ హీరోల మధ్య పోటీ మాత్రమే కాదు మిడిల్ రేంజ్ యంగ్ హీరోల మధ్య పోటీ కూడ తరుచూ మారిపోతూ ఇండస్ట్రీ వర్గాలకు ఆసక్తిని క్రియేట్ చేస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: