మరో నాలుగు రోజుల్లో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా నటించిన డియర్ కామ్రేడ్ సినిమా విడుదల కాబోతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో ఈ సినిమాను జులై26న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం విజయ్ దేవరకొండ మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ ఉన్నాడు. ఈ మ్యూజిక్ ఫెస్టివల్స్ కోసం దాదాపుగా నెల రోజుల పాటు డాన్స్ ప్రాక్టీస్ చేసాడట విజయ్ దేవరకొండ. 
 
విజయ్ దేవరకొండ చేస్తున్న ప్రయోగాలు టాలీవుడ్ స్టార్ హీరోలను ఇబ్బంది పెడుతున్నాయి. చాలా మంది స్టార్ హీరోలు తమ సినిమా రిలీజవుతున్నా సినిమా ప్రమోషన్లను పెద్దగా పట్టించుకోరు. ఒకటి రెండు ఛానెళ్ళకు ఏదో మొక్కుబడిగా ఇంటర్వ్యూలు ఇస్తారు లేదా ఒక యాంకర్ తో ఇంటర్వ్యూ చేసి అదే వీడియోను అన్ని ఛానెళ్ళకు పంపుతారు మరికొంతమంది హీరోలు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ప్రతి సినిమా విడుదలకు ముందు సినిమాపై అంచనాలు పెరిగేలా చేస్తున్నాడు. 
 
అర్జున్ రెడ్డి సినిమాకు విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్లు ఆ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. గీతా గోవిందం సినిమా విడుదలకు ముందే విజయ్ రష్మిక లిప్ లాక్ ఫోటోలు లీక్ అవ్వటం ఆ సినిమాపై క్రేజ్ పెంచాయి. ట్యాక్సీవాలా సినిమా ప్రమోషన్ల కోసం ట్యాక్సీ నడిపి సినిమాపై అంచనాలు పెంచాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా కోసం సౌత్ ఇండియా అంతా మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నాడు విజయ్ దేవరకొండ. మిగతా స్టార్ హీరోలు కూడా విజయ్ దేవరకొండలా వినూత్నంగా ఆలోచించి సినిమా ప్రమోషన్స్ చేస్తే బాగుంటుందనే కామెంట్లు ప్రేక్షకుల నుండి వినిపిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: