ఏ రంగంలో అయినా జయాపజయాలు అనేవి మన చేతుల్లో ఉండవు అనేది తెలిసిందే. మనం చేయవలసిన మానవ ప్రయత్నం చేస్తే సరిపోదు, కొంత మనకు అదృష్టం కూడా కలిసిరావాలి అనేది జగమెరిగిన సత్యం. అయితే అన్ని రంగాలతో పోలిస్తేసినిమా రంగంలో సక్సెస్ అనేది ఒకసారి రావడం మొదలైతే చాలు, దాని వెంట పేరు, డబ్బు అమాంతం వచ్చి పడుతుంటాయి. కానీ దానిని కేవలం తెలివితో వ్యవహరించి అతి కొద్దిమంది మాత్రమే నిలబెట్టుకోగలుగుతారు. 

ఇక ఇటీవల పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారి, తోలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ, కొన్నాళ్ల క్రితం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో హిట్ కొట్టి, యువత గుండెల్లో మంచి స్థానాన్ని సంపాదించాడు. ఇక ఆ తరువాత అయన నటించిన గీత గోవిందం సినిమా కూడ సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో నేటి యూత్ లో విజయ్ కి విపరీతమైన ఫాలోయింగ్ రావడం జరిగింది. ఇక ప్రస్తుతం ఎక్కువగా యువతలో ఎవరిని కదిపినా విజయ్ పేరే స్మరిస్తున్నారు. అంతలా అతడు వారి మనసులలోకి చొచ్చుకుపోయాడు. ఇకపోతే మూడురోజుల క్రితం జరిగిన డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్ లో విజయ్ చేసిన సందడికి సినిమా యూనిట్ సహా ఆయన ఫ్యాన్స్ అందరూ ఎంతో సంబరపడిపోతూ కేరింతలు కొట్టారు. ఇక ఈ సినిమా కూడా అనుకున్నట్లుగా సూపర్ హిట్ ని సొంతం చేసుకుంటే విజయ్ ఫాలోయింగ్ మరింత పెరగకమానదు. 

ఒక రకంగా ప్రస్తుతం అతడి క్రేజ్  చూస్తుంటే,కొందరు స్టార్ హీరోలు సైతం భయపడే రేంజిలో ఉందని, ఇక ఇదే ఊపులో అతడు మరొక రెండు, మూడు సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటే కనుక, అతడు స్టార్ హీరోల స్థాయికి అమాంతం చేరిపోవడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు. అంతేకాదు విజయ్ ఫాలోయింగ్ చూస్తుంటే పిచ్చెక్కిపోతోందని, రాబోయే రోజుల్లో అతడి సక్సెస్ లతో టాలీవుడ్ స్టార్ హీరోల వెన్నులో వణుకుపుట్టడం ఖాయమనేది మరికొందరు అంటున్నమాట. మరి ప్రస్తుతం మంచి జోష్ తో వరుసగా సినిమాలు చేస్తూ ముందుకువెళ్తున్న విజయ్, రాబోయే రోజుల్లో ఎంతటి క్రేజ్ ని సంపాదిస్తాడో వేచి చూడాలి.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: