గతంలో ప్రపంచంలో అత్యథిక వసూళ్లు సాధించిన సినిమాగా టైటానిక్ ఉండేది.  ఆ సినిమాను అవతార్ బ్రేక్ చేసింది.  ప్రపంచ వ్యాప్తంగా 19,210 కోట్ల రూపాయలు వసూలు చేసింది.  ఈ రికార్డును ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేదు.  ఎవెంజర్స్ మొదట్లో చాలా దూకుడును ప్రదర్శించింది. కానీ, ఆ దూకుడు తరువాత కాలంలో తగ్గిపోయింది.  


అవతార్ ను బ్రేక్ చేయడం కోసం హల్క్ సీన్స్ కొన్ని యాడ్ చేసి తిరిగి రిలీజ్ చేశారు.  ఇప్పుడు ఈ సినిమా దాదాపుగా అవతార్ ను బీట్ చేసేలానే కనిపిస్తోంది.  మరో 3.5 కోట్లు వసూలు చేస్తే సినిమా బ్రేక్ అవుతుంది.  ఈ వారాంతానికి ఇది బ్రేక్ కావొచ్చు. ఎవెంజర్స్ బ్రేక్ చేసినా.. మరో రెండేళ్లలో ఈ సినిమాను బ్రేక్ చేయడానికి అవతార్ 2సిద్ధంగా ఉన్నది .  


ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.  కానీ, కొన్ని కారణాల వలన సినిమా ఆలస్యం అయ్యింది.  ఎక్కడా రాజీపడకుండా విజువల్ ఎఫెక్ట్స్ ను రూపొందిస్తున్నారు.  2021 డిసెంబర్ 17 వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.  ఈ అవతార్ సిరీస్ లో ఇంకా నాలుగు భాగాలు రిలీజ్ కావాల్సి ఉన్న సంగతి తెల్సిందే.  


అవతార్ లో ఐదు సీరీస్ లు ఉన్నాయి కాబట్టి.  ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించే సినిమాగా ఈ అవతార్ సీరీస్ నిలుస్తుందని అంటున్నారు.  అందులో ఎలాంటి సందేహం ఉండకపోవచ్చు.  మొదటి సినిమాతో పోలిస్తే రెండో సినిమా భారీతనంతో విజువల్ ఎఫెక్ట్స్ తో కనువిందు చేయబోతుందట.  


మరింత సమాచారం తెలుసుకోండి: