ఇప్పటికే స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయిన బుల్లి తెర క్రేజీ షో బిగ్ బాస్ రెండు సీజన్లకు ఎంతటి పేరొచ్చిందో అందరికి తెలిసిందే. తోలి సీజన్ కు ఎన్టీఆర్, రెండవ సీజన్ కు నాని హోస్టులుగా వ్యవహరించి వాటిని మరింత సక్సెస్ చేశారనే చెప్పవచ్చు. ఇక నిన్న ఎన్నో అంచనాల మధ్య వీక్షకుల ముందుకు వచ్చిన బిగ్ బాస్ సీజన్ 3, మంచి సక్సెస్ సాధించిందని అంటున్నారు విశ్లేషకులు. అందుకు నిదర్శనం నిన్న షో ప్రసార సమయంలో వచ్చిన రేటింగ్స్ అని వారు అంటున్నారు. వాస్తవానికి మరింత ముందుగానే ప్రసారం కావలసిన ఈ షో, 

కొన్ని కారణాల రీత్యా కాస్త ఆలస్యంగా ప్రారంభం కావడంతో షో పై వీక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయనే చెప్పాలి. ఇక ఈ  షోకి హోస్ట్ గా వ్యవహరించిన కింగ్ నాగార్జున, తన స్టన్నింగ్ పెర్ఫార్మన్స్ తో అందరిని ఆకట్టుకున్నారు. ఇకపోతే నిన్నటి ఫస్ట్ ఎపిసోడ్ మంచి సక్సెస్ సాధించడంతో, ఆ ఆనందాన్ని నాగ్ కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. నిన్న రాత్రి ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు 3 ట్విట్టర్ లో వరల్డ్ వైడ్ టాప్ నెంబర్ వన్ గా కాసేపు ట్రెడింగులోకి రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందంటూ ఆయన ట్వీట్ చేశారు. రాబోయే రోజుల్లో షో మిమ్మల్ని మరింత అలరిస్తుంది అంటూ ఆయన చెప్పడం జరిగింది. 

నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఈ షోపై మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉండడంతోనే తమ షోకు ట్విట్టర్ లో ఇంత మంచి ఖ్యాతి లభించిందని బిగ్ బాస్ నిర్వాహకులు అంటున్నారట. మరి నిన్న హౌస్ లోకి అడుగుపెట్టిన 15మంది కంటెస్టెంట్స్ లో రాబోయే వారానికి సంబంధించి అప్పుడే ఎలిమినేషన్ లిస్ట్ లో నిలిచిన జాఫర్, శ్రీముఖి, వరుణ్ సందేశ్ తదితరుల్లో ఎవరెవరు హౌస్ లో నిలుస్తారో తెలియాలంటే మరికొద్దిరోజలు ఓపికపట్టాల్సిందే......!!     


మరింత సమాచారం తెలుసుకోండి: