2017లో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తరువాత రవితేజ మరలా హిట్ కొట్టలేదు. టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు ఒకదానిని మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి. మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న రవితేజకు వరుస ఫ్లాపులు రావటంతో రవితేజ మార్కెట్ కూడా దెబ్బతింది. దర్శక నిర్మాతలు కూడా రవితేజతో సినిమాలు తీయడానికి పెద్దగా ఆసక్తి చూపట్లేదు. ప్రస్తుతం రవితేజ చేతిలో రెండే సినిమాలున్నాయి. ఒకటి డిస్కోరాజా, రెండోది మహా సముద్రం. 
 
రవితేజ డిస్కో రాజా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు రవితేజ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నప్పటికీ మహా సముద్రం సినిమాలో మాత్రం రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటిస్తున్నాడట. సినిమాను క్వాలిటీతో నిర్మించమని, సినిమాకు లాభాలు వస్తే ఆ లాభాల్లో షేర్ తీసుకుంటానని దర్శక నిర్మాతలకు చెప్పాడట రవితేజ. రవితేజ తీసిన గత సినిమాల్లో సినిమా క్వాలీటీపై కొన్ని విమర్శలు రావటంతో రవితేజ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 
 
మహా సముద్రం సినిమాకు ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాలో రవితేజతో పాటు సిద్దార్థ్ కూడా నటిస్తున్నాడు. స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న రవితేజ, సిద్దార్థ్ లకు ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాల్సిన అవసరం ఉంది. రవితేజ సరసన అదితీరావ్ హైదరీ నటిస్తుండగా సిద్దార్థ్ కు హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. అక్టోబర్ నెల నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకాబోతున్నట్లు సమాచారం అందుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: