తెలుగు బిగ్ బస్ ౩ సీజన్ ప్రారంభం కావడానికి మూడు నెలల ముందు నుంచే ఈ షో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే, ఈ షో పై సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది ఈ సారి హౌస్ లో ఎవరెవరు వెళ్తారు హోస్ట్ గా ఎవరు వ్యవహరిస్తారు అని ఇన్టర్నేట్ లో తెగ హల్ చళ్ చేసింది. గత రెండు సీజన్ లతో పోలిస్తే బిగ్ బాస్ ౩ మొదలు కాకముందే చాలా విమర్శలకు కారణమైంది.


గతంలో జరిగిన బిగ్ బాస్ 1 మరియు బిగ్ బాస్ 2 లోని లీక్ లను దృష్టిలో ఉంచుకొని ఈ సారి స్టార్ మా ఛానల్ వారు చాలా గట్టిగా చర్యలను చేపట్టారు. కానీ ఈ షోలో వెళ్ళిన చాలామంది హౌస్ మేట్ పేర్లు సోషల్ మీడియాలో ఎప్పటి నుండో ప్రచారం కావడం గమనార్హం. అయితే నిన్న ఆదివారం రాత్రి తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ సీజన్ ౩ మొదటి ఎపిసోడ్ ప్రసారమైంది అందులో యువసామ్రాట్ అక్కినేని నాగార్జున గారు తన హోస్టింగ్ తో అలరించి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. 


ఈ సీజన్ లో పదిహెను మంది సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. అయితే నిన్నటి బిగ్ బాస్ సంబంధించిన ఎపిసోడుల గురించి కింగ్ నాగార్జున గారు ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. తెలుగు బిగ్ బాస్ త్రీ హాష్టాగా వ్యవహరించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది అంతేకాక ఆదివారం రాత్రి ట్విట్టర్ లో వోల్వో వాయిడ్ ట్రైండ్స్ లో  నెంబర్ వన్ గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు బిగ్ బాస్ ఆదరిస్తున్న వారందరికీ తను ధన్యవాదాలు తెలుపుతూ దీనికి సంబంధించిన ఫొటో కూడా ఆయన ఒకటి పోస్ట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: