ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి అనే సామెత సినిమా ఇండస్ట్రీకి సరిగ్గా సరిపోతుంది. ఇక్కడ  సక్సెస్ ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలీదు. ఎవరు సక్సెస్ అవుతారో కూడా తెలీదు. ప్రతి శుక్రవారం నటులు, టెక్నీషియన్ల రాత మారిపోతూ ఉంటుంది. ప్రస్తుతం థియేటర్లలో రఫ్ఫాడిస్తున్న ఇస్మార్ట్ శంకర్ విషయంలో పూరి, మణిశర్మ, రామ్ ల పరిస్థితి ఇలానే ఉంది. గతంలో సూపర్ ట్రాక్ రికార్డు ఉన్న ఈ ముగ్గురూ తమ కెరీర్లో చాలా టఫ్ ఫేస్ చూస్తున్నారు.

 

రామ్ కి హిట్స్ తగ్గాయి. ఉన్న కాస్త మార్కెట్ కి బీటలు పడ్డాయి. సొంత బ్యానర్ స్రవంతి రవికిషోర్ పుణ్యమా అని  పడుతూ లేస్తున్న పరిస్థితి. పూరి, మణిశర్మ అయితే కెరీర్ లో సక్సెస్ ని టాప్ పీక్స్ లో చూసారు. సక్సెస్ లో ఉన్నప్పుడు, ఓ దశలో వీళ్ళ కోసం ఇండస్ట్రీలో క్యూలు కట్టారు. ఫ్లాపులు రావడంతో కొన్నేళ్లుగా వీళ్ల తలుపు తట్టినవారు లేరు. ఓన్ టాలెంట్ తో పూరి, అప్పుడప్పుడు వస్తున్న అవకాశాలతో మణిశర్మ తమ ఉనికిని కాపాడుకునే పరిస్థితికి వచ్చేసారు. ఒక్క అవకాశం.. అంటూ మంచి కసిమీద ఉన్న ఈ ముగ్గురికీ ‘ఇస్మార్ట్ శంకర్’ రూపంలో ఫుల్ మీల్స్ దొరికినట్టైంది. ఎవరి విభాగాల్లో వాళ్లు తమ టాలెంట్ కు పదునుపెట్టడంతో సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ సినిమాలో వీళ్ల టాలెంట్ ను చూసిన ఇండస్ట్రీ ఉలిక్కపడ్డట్టే అయింది..

 

పూరీకి బ్లాక్ బస్టర్ తీయడం, మణిశర్మకు మంచి ట్యూన్స్ ఇవ్వడం, సరైన సినిమా పడితే రామ్ కు టాలెంట్ చూపడం కష్టమేమీ కాదు. నాలుగు రోజుల్లో 42 కోట్లకు పైగా కలెక్ట చేసి సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికైనా తెలుగు ఇండస్ట్రీ రిపీటెడ్ ట్యూన్స్ ఇచ్చే మ్యూజిక్ డైరక్టర్స్ ను, సినిమా తీయడం రావటంలేదని టాలెంట్ డైరక్టర్లని పక్కన పెట్టడం మానుకుంటే మరిన్ని బ్లాక్ బస్టర్స్ ఇవ్వగల స్టామినా వీరికి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: