ఒకే ఒక్క  కన్నుగీతతో కుర్రాళ్ల అందరినీ తన వైపు తిప్పుకుంది అలాగే ఫ్లైయింగ్ కిస్ గన్ తో ఫిలిమ్ మేకర్లు తన వైపు చూసేలా చేసుకుంది ప్రియా ప్రకాష్ వారియర్.  ఒకే ఒక్క వీడియో తో సోషల్ మీడియా లో సెన్సేషన్ అయిపోయింది.  దీంతో ఇప్పుడు ఆమె అందరికీ సుపరిచితురాలైపోయింది. దీంతో అన్ని భాషల్లో అమె నటిస్తున్నారు. ఐతే తాజా గా ఆమె మరోసారి సోషల్ మీడియా లో ఓ వీడియో పోస్ట్ చేసి హాట్ టాపిక్ అయిపోయింది. 


ప్రియా ప్రకాష్  తాజాగా ఓ వీడియో తన ఇన్స్టాగ్రామ్   ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో ఆమెతో పాటు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్రీనూ శ్రీనాథ్ ఉన్నారు. ఈ వీడియోలూ ఇద్దరూ లిప్ కిస్ పెట్టుకొనేందుకు ట్రై చేసినట్లు ఉంటోంది. ఇద్దరూ సరదాగా విలీనమైన తర్వాత శ్రీను తన ముఖాని పక్కకి తిప్పి బాటిల్ లో నీళ్ళు తాగుతాడు దీంతో ప్రియా అప్సేట్  ఐపోతోంది. దీనికి మూమెంట్  విత్ మై ఫేవరేట్ శ్రీనూ శ్రీనాథ్ అని ప్రియా ప్రకాష్ వారియర్ కాప్షన్ ఇచ్చింది.


ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రస్తుతం బాలీవుడ్ లో శ్రీదేవి బంగ్లా అనే సినిమాలో నటిస్తోంది. ప్రశాంత్ మాంబులి డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజర్ ను ఇటీవలే విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో ఆమె పేరు శ్రీదేవి అవడం అందులో ఆమె నటిగా కనిపించడం చివర్లో బాత్ టబ్ లో మరణించి ఉండడం చూసి ఇది అందాల నటి శ్రీదేవి బయోపిక్ అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.


ఇప్పటికే ఈ సినిమా హైలెట్ అవడంతో పాటు వివాదాలు కూడా చెలరేగాయని ఇప్పుడు ప్రియా పోస్ట్ చేసిన వీడియో తో ఆమె మర్ఓసారి వార్తల్లోకి ఎక్కింది. వీడియో చూసిన వారంతా ఆమెను ట్రోల్ చేస్తున్నారు దీతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అయిపోయింది

మరింత సమాచారం తెలుసుకోండి: