మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో 151 వ సినిమా సైరా చేస్తున్నారు.  ఏడేళ్ల విరామం తరువాత ఖైదీ నెం 150 సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగాస్టార్, ఆ సినిమాతో తిరిగి రికార్డులు సృష్టించారు.  ఈ రికార్డులను సైరాతో అధిరోహించబోతున్నాడు.  సైరా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  


షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నది.  దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ప్రస్తుతం మెగాస్టార్ తన నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టారని సమాచారం.  152 వ సినిమా కొరటాలతో చేస్తున్నారు.  ఇందులో మెగాస్టార్ రెండు కీలక పాత్రలు చేస్తున్నారు.  దీనికోసం స్లిమ్ గా కనిపించాయి.  


దీనికోసం న్యాచురోతెరిపి ద్వారా సన్నబడేందుకు ప్రయత్నిస్తున్నారు.  విశాఖలోని ఓ బీచ్ స్పాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని సమాచారం.  ఖైదీ నెంబర్ 150 కంటే స్లిమ్ గా కనిపించబోతున్నారనే తెలుస్తోంది.  ఈ మూవీ త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.  


ఇప్పటికే అన్ని పనులు పూర్తయ్యాయి.  మెగాస్టార్ స్లిమ్ అయ్యాక షూటింగ్ మొదలౌతుంది.  ఈ సినిమాను రామ్ చరణ్, మ్యాట్నీ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: