సినిమా ప్రేక్షకులు ఎప్పుడు ఏ సినిమాని ఏ విధంగా ఆదరిస్తారో, ఎంతటి విజయాన్ని అందిస్తారో అనేది మనుషులెవ్వరూ కూడా చెప్పలేని విషయం. అయితే ఒక్కోసారి మనం అనుకున్నవి పూర్తిగా తారుమారైతే, మరోసారి మనం ఊహించిన దానికంటే మరింత లాభం చేకూరుతుంది. ఇక ఈ విధంగా ఇటీవల ఎన్నో అంచనాలతో దర్శకుడు పూరి మరియు ఎనర్జిటిక్ హీరో రామ్ ల కలయికలో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సినిమా యూనిట్ అంచనాలను మించి ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది. 

వాస్తవానికి ఈ సినిమాకు కొన్ని చోట్ల నుండి కాస్త నెగటివ్ ప్రచారం జరుగుతున్నప్పటికీ, వస్తున్న కలెక్షన్లు చూస్తుంటే మాత్రం అందరికీ మైండ్ బ్లాంక్ అవుతోంది. ఇప్పటికే 4 రోజులకు గాను రూ. 48 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ ని సంపాదించిన ఈ సినిమా, ఇప్పటికీ చాలా చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దుమ్ము దులుపుతున్నట్లు ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అయితే ఒక సినిమా ఎంత సక్సెస్ అయిందని చెప్పడానికి కొలమానం ఆ సినిమాకు వచ్చే కలెక్షన్లే కాబట్టి, దీన్ని బట్టి చూస్తే ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ దిశగా సాగుతున్నట్లు వారు అంటున్నారు. 

ఇక ప్రస్తుతం పెద్దగా సినిమాలేవీ లేకపోవడం, అదీకాక ఈ సినిమాలో హీరో రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్, పూరి మార్క్ డైలాగ్స్ మరియు టేకింగ్ ముఖ్యంగా యువతను మరియు మాస్ ఆడియన్స్ ను విపరీతంగా మెప్పిస్తున్నాయట. మరి రాబోయే రోజుల్లో ఇస్మార్ట్ శంకర్ ఇంకెంతటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడో తెలియాలంటే మాత్రం మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: