గాయని నటి స్నిగ్ధ ని  చూస్తే ఎవరికైనా అబ్బాయి ఏమో అనిపిస్తుంది. స్నిగ్ధ  హెయిర్ స్టైల్,  వస్త్రధారణ కూడా అబ్బాయిని తలపించే మాదిరిగానే  ఉంటుంది.  సినిమాల్లో కూడా తన లుక్ కూడా మగరాయుని మాదిరిగా ఉండడం తో ,  శ్రద్ధ  అబ్బాయి గా మారిపోయిందనే  ప్రచారం జరుగుతోంది.


 తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్నిగ్ధ ఈ  విషయాన్ని ప్రస్తావిస్తూ భగవంతుడు తనని అమ్మాయిగా సృష్టించాడని ...  మంచి వాయిస్ ఇచ్చాడని...  గాయనిగా ఇప్పుడిప్పుడే  మంచి పేరు వస్తుందని చెప్పింది .  అమ్మాయి వాయిస్ తో అబ్బాయి గా మారడానికి ఎందుకు ప్రయత్నిస్తానని ఎదురు ప్రశ్నించింది స్నిగ్ధ .


 ఒకవేళ తాను అబ్బాయి గా మారాలి అనుకున్నా ...  అంత చిన్న విషయం కాదని చిటికలో జరిగే పని కూడా కాదన్నారు .  తాను  తనలాగే ఉంటానని ...  తనకు అబ్బాయి గా  మారే  అవసరం లేదని చెప్పుకొచ్చింది . తనగురించి ఎవరో  ఏదో అనుకుంటే తనకు వచ్చే నష్టం ఏమీ లేదు అంటూ  చెప్పింది స్నిగ్ధ .  పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన స్నిగ్ధ , ఇటీవల గాయనిగా కూడా రాణిస్తోంది .

 


మరింత సమాచారం తెలుసుకోండి: