ఒక్క సినిమా ఎన్నో మార్పులు ఎందురికో అవ‌కాశాలు. అలా ఇటీవ‌లె విడుద‌లైన ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం నిరూపించింది. ఏ సినిమా అయినా ఆ హీరో ఆ ద‌ర్శ‌కుడు ఆ హీరోయిన్ గ‌తిని స్థితిని మార్చేస్తుంది.. ఒకే ఒక్క ఛాన్స్ అని అందుకే అంటారు... ఆ ఒక్క ఛాన్స్ కోసం ఎన్నో అవ‌మానాలు ప‌డ‌తారు.. మ‌రెన్నో సంవ‌త్స‌రాలు వేచి ఉంటారు.. అందుకే ఏ రంగానికీ లేని క్రేజ్ సినిమాకు మాత్ర‌మే ఉంటుంది... ఒక్క హిట్‌తో ఆ తార‌ల‌, సాంకేతిక నిపుణుల స్థాయితో పాటు రెమ్యూన‌రేష‌న్ లు  కూడా అమాంతం పెరిగిపోతాయి..ఒక్క సినిమాతో స్టార్ స‌ర‌స‌న కుర్చీ ల‌భిస్తుంది..అంత‌వ‌ర‌కూ ప్లాప్‌ల్లో ఉన్న వారైనా ఆ ఒక్క హిట్‌తో పోగొట్టుకున్నవ‌న్నీ తిరిగి పొంద‌గ‌లుగుతారు.. స‌రిగ్గా ఇపుడు `ఇస్మార్ట్ శంక‌ర్` విష‌యంలో అలానే జ‌రిగింది.. ప్లాపుల్లో ఉన్న హీరో హీరోయిన్లకు కొత్త క్రేజ్ మొద‌లైంది... ప్లాపుల్లో ఉన్న ద‌ర్శ‌కుడ‌ని కాల్షీట్‌లు ఇవ్వ‌ని పెద్ద‌హీరోలు ఇపుడు ఆహ్వానం ప‌ల‌క‌వ‌చ్చు... ఇలా ఎన్నో ర‌కాల ప్ర‌యోజ‌నాలు ఆ సినిమాతో సొంత కాబోతున్నాయి.. అందుకే చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌తిఒక్క‌రూ  ఆ ఒక్క హిట్ కోసం ప‌రిత‌పిస్తారు... ఇక్క‌డ విజ‌య‌మే సెంటిమెంటు..అల్టిమేటు..


అలాగే రామ్‌కి కూడా చాలా రోజుల నుంచి హిట్ సినిమా లేదు. ఈ చిత్రంతో మంచి హిట్ కొట్టాడు. ఇక పూరి సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. టెంప‌ర్‌, రోగ్‌, మెహ‌బూబా చిత్రాలు ఆశించినంత ఫ‌లితం రాలేదు. ఇస్మార్ట్‌తో మ‌ళ్లీ హిట్ కొట్టారు. నిధి అగ‌ర్వాల్ కెరియ‌ర్ మొద‌లుపెట్టిన ద‌గ్గ‌ర్నుంచి ఒక్క హిట్ కూడా రాలేదు. ఈ సినిమాతో మంచి హిట్ వ‌చ్చింది. ఈ టీమ్ అంద‌రికీ ఇక నుంచి ఇలానే మంచి విజ‌యాలు రావాల‌ని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: