Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 26, 2019 | Last Updated 2:26 pm IST

Menu &Sections

Search

విక్టరీ క్లాప్‌తో ప్రారంభమైన యాక్షన్ థ్రిల్లర్ ’22’

 విక్టరీ  క్లాప్‌తో ప్రారంభమైన  యాక్షన్ థ్రిల్లర్ ’22’
విక్టరీ క్లాప్‌తో ప్రారంభమైన యాక్షన్ థ్రిల్లర్ ’22’
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
శివకుమార్‌ బి. దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్ ’22’. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈరోజు (జులై 22) రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది. హీరోహీరోయిన్లపై విక్టరీ వెంకటేష్‌ క్లాప్‌ కొట్టగా, ప్రముఖ నిర్మాతలు బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌, నవీన్‌ ఎర్నేని, కొండా కృష్ణం రాజు సంయుక్తంగా కెమెరా స్విచ్‌ ఆన్‌ చేసారు. ముహూర్తపు షాట్‌కు ప్రముఖ దర్శకులు భీమినేని శ్రీనివాస రావు గౌరవ దర్శకత్వం వహించారు. పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ చిత్ర దర్శకుడు శివకుమార్‌కి స్క్రిప్ట్‌ అందించి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఈ చిత్రం పూజ కార్యక్రమాలు ‘పవర్‌’ దర్శకుడు కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) నిర్వహించారు. విశిష్ట అతిథిగా సుప్రీమ్‌ హీరో సాయి తేజ్‌ హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమానికి సి.అశ్వనీదత్‌, కె.ఎస్‌. రామారావు, యం.యస్‌.రాజు, అనీల్‌ సుంకర, శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి, జెమిని కిరణ్‌, ఎస్‌.వి. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, కె.కె. రాధామోహన్‌, సముద్ర, నిమ్మకాయల ప్రసాద్‌, చిట్టూరి శ్రీనివాసరావు, సాగర్‌ తదితరులు హాజరై దర్శక నిర్మాతలకి, చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
ఇటీవలి కాలంలో చిన్న సినిమాకి ఇంతమంది అతిథులు హాజరై శుభాకాంక్షలు తెలపడం విశేషం.


దర్శకుడు శివకుమార్‌ బి. మాట్లాడుతూ – ”ఈ ప్రారంభోత్సవానికి మా యూనిట్‌ని బ్లెస్‌ చెయ్యడానికి వచ్చిన విక్టరీ వెంకటేష్ గారికి, సాయితేజ్‌, హరీష్ శంకర్, బాబీ గారికి, అలాగే ప్రముఖ దర్శకులు, నిర్మాతలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను దర్శకుడిగా పరిచయమయుతున్న తొలి చిత్రానికి విక్టరీ వెంకటేష్ గారు క్లాప్ నివ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా సాయి తేజ్ గారి రెండు సినిమాలకు పని చేశాను. ఆయన ఈ కార్యక్రమానికి రావడం హ్యాపీ గా ఉంది. నేను మారుతి, పూరి జగన్నాథ్‌, వి.వి.వినాయక్‌గార్ల వద్ద వర్క్‌ చేశాను. ఆ ముగ్గురి ఇన్‌స్పిరేషన్‌ వల్లే ఈరోజు నేను మీ ముందున్నాను. మా ప్రొడక్షన్‌ హెడ్‌ ఆనీలామా మాస్టర్‌ ద్వారా నేను నిర్మాత శ్రీమతి సుశీలాదేవిగారిని కలిసి కథ చెప్పడం జరిగింది. సలోని పూరి కనెక్ట్స్‌ నుండి వచ్చింది. మేం వెళ్ళి అడగ్గానే డేట్స్‌ అడ్జెస్ట్‌ చేసి ఇచ్చిన పూరి కనెక్ట్స్‌ పూరి జగన్నాథ్‌, ఛార్మిగార్లకు థాంక్స్‌. అలాగే ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో బ్లాక్‌ బస్టర్‌ సాధించినందుకు మా చిత్ర యూనిట్‌ తరపున కంగ్రాట్స్‌. ఈ సినిమాలో బిగ్‌ బాస్‌ ఫేం పూజా రామచంద్రన్‌ ఒక క్రూషియల్‌ క్యారెక్టర్‌ చేస్తుంది. ఈ సినిమాకి సాయి కార్తీక్‌ సంగీతం అందిస్తున్నారు. అలాగే ‘బాహుబలి’, ‘ఖైదీ నెం 150 ‘,’సాహో’ చిత్రాలకి వర్క్‌ చేసిన జాషువాగారి యాక్షన్‌ సీక్వెన్స్‌ మా చిత్రానికి హైలైట్స్‌గా నిలుస్తాయి. నాకు బిగ్గెస్ట్‌ స్ట్రెంగ్త్‌ ఎవరంటే మా మదర్‌ జయగారు. మా అమ్మగారి దగ్గర ప్రొడక్షన్‌తో పాటు దర్శకత్వ శాఖలో మెళకువలు నేర్చుకున్నాను. ఆవిడ ఎక్కడ ఉన్నా ఇవన్నీ చూసి ఆనందిస్తారనుకుంటున్నాను. అలాగే మా నాన్న బి.ఏ రాజుగారు ఎప్పుడూ నన్ను ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ ’22’ అనేది ఒక నెంబర్‌. ఆ నెంబర్‌కి ఒక కీ ట్విస్ట్‌ ఉంది. అది రివీల్‌ చేస్తే ఆ కిక్‌ ఉండదు. మర్డర్‌ మిస్టరీతో మిక్స్‌ అయిన కంప్లీట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. ఈనెల 29 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది.” అన్నారు.


హీరో రూపేష్‌ కుమార్‌ చౌదరి మాట్లాడుతూ – ”నాకు చిన్నప్పటి నుండి మంచి ఆర్టిస్ట్‌ కావాలని కోరిక ఉండేది. ఆ కోరిక ఈరోజు నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను విక్టరీ వెంకటేష్ గారి ఫ్యాన్ ని ఆయన సినిమాలు ఒక్కొక్కటి పది పదిహేను సార్లు చూశాను. అలాంటిది నా మొదటి సినిమాకు విక్టరీ వెంకటేష్ గారు క్లాప్ కొట్టడం చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. ఒకరోజు శివగారిని కలిశాం. అలా ఇద్దరం డిస్కస్‌ చేసుకొని ఆయన దర్శకత్వంలో ఒక వెబ్‌ సిరీస్‌ చేశాం. ’22’ చాలా మంచి స్క్రిప్ట్‌. మంచి టీమ్‌ కుదిరింది. ఈ సినిమాలో డ్యాన్స్‌, ఫైట్స్‌ కోసం శిక్షణ తీసుకుంటున్నాను. మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికీ నచ్చేవిధంగా దర్శకుడు శివకుమార్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు” అన్నారు.


హీరోయిన్‌ సలోని మిశ్రా మాట్లాడుతూ – ”మా చిత్రం ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులందరికీ థాంక్స్‌. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్ర దర్శకుడు శివ అమేజింగ్‌ పర్సన్‌. ఈ సినిమా ట్విస్ట్‌ అండ్‌ టర్న్‌లతో అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. అలాగే కోయాక్టర్స్‌ రూపేష్‌ కుమార్‌, పూజతో కలిసి పని చేయడం హ్యాపీ. నా తొలి చిత్రం ‘ఫలక్‌నుమాదాస్‌’ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను.” అన్నారు.


నటి పూజా రామచంద్రన్‌ మాట్లాడుతూ – ”నాకు ఈ రోల్‌ ఇచ్చిన ఆనీ మాస్టర్‌కి థాంక్స్‌. ఆ క్యారెక్టర్‌కి సంబంధించి దర్శకుడు శివ నిన్ననే ఆడిషన్‌ చేశారు. పెర్‌ఫార్మెన్స్‌కి మంచి స్కోప్‌ ఉండే క్రూషియల్‌ క్యారెక్టర్‌. ఇది నాకు ఒక ఛాలెంజింగ్‌ రోల్‌. ఈ ప్రారంభోత్సవం ఇంత ఘనంగా జరగడం చాలా సంతోషంగా ఉంది” అన్నారు.


siva-director
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పెళ్ళొద్దు శృంగారమే ముద్దు
బాలీవుడ్‌కి పోటీగా టాలీవుడ్‌
RRR లో ప్రభాస్ ఇన్వాల్వ్మెంట్ వర్క్ ఔట్ అవుతుందా..?
సెప్టెంబ‌ర్ 1 నుంచి రోడ్డు ఎక్కితే మీ జేబు గుల్లే... ఎందుకో చ‌ద‌వండి..!
ఆ సీన్ క‌ట్ చేసినందుకు మండిప‌డుతుంది
వీడు మ‌నిషేనా... 30 ఏళ్ళ‌లో 250మందిని...?
సాహోలో పెద్ద ట్విస్ట్ అదే...!
జగన్.. ఆ విషయంలో ఎన్టీఆర్ లా ఆలోచిస్తే బావుంటుందేమో..!
జాడే రోల‌ర్‌తో ఇంత చ‌ర్మ‌సౌంద‌ర్య‌మా...?
వహ్‌వా..రాజ్మా
ఈ  "చీమ" - రాజమౌళి  "ఈగ" లా హిట్ కొడుతుందా ?
లైట్‌ హౌస్ లో క్రైం థ్రిల్లింగా ఉంట‌దా...?
నాగార్జునకు అస్వస్థత!
నీ కోసం అంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
నిన్నంతా నా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది- భీమ‌నేని శ్రీ‌నివాస్‌
ఫ‌స్ట్‌టైం విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో అయితే బావుండేదంటున్న ఐశ్వ‌ర్య‌
ప‌న్నెండు గంట‌లు నీళ్ళ‌లో ఉండిపోయాను
అబ్బూరి ర‌విని అలా పిలిస్తే కొడ‌తాడంట‌...?
కృష్ణాన‌గ‌ర్ క‌ష్టాలు చాలా అనుభ‌వించాను
ఇన్ని సినిమాలు ఒకేరోజు రిలీజ్‌... ఎన్ని ఆడ‌తాయో...?
ఈ "గ్యాంగ్ లీడర్" కి చిరుతో పోటీ సాధ్య‌మేనా...?
‘చదివిందేమో టెన్త్‌రో... అయ్యిందేమో డాక్టరో’ అంటున్న నందితాశ్వేత‌
'రాజావారు రాణిగారు' 'నమ్మేలా లేదే..కల కాదే..
న‌ట‌కిరీటి గురించి  ఐశ్వ‌ర్య అలా అందేంటి
నా బాధ‌ల‌కి ఈ టైటిల్‌కి సంబంధం లేదు
సిగరెట్ తాగిన రావణాసురుడు: ఎస్వీఆర్ కు బామ్మ ఝలక్ ?
జగన్ డల్లాస్ గొడవ :  ఓహో.. అసలు సంగతి ఇదా..?
ప్లీజ్ అనుష్క పెళ్లి చేసుకోవా...ప్ర‌భాస్‌
చ‌ర‌ణ్‌కు బాలీవుడ్  అయితే ఎన్టీఆర్‌కు హాలీవుడ్
24 గంటల్లో.. 23 మిలియన్ల వ్యూస్‌తో దుమ్మురేపిన సైరా టీజర్...
ప‌వ‌న్‌ను టార్గెట్ చేస్తే వైసీపీకే న‌ష్ట‌మా...?
ఐశ్వ‌ర్య‌తో క‌లిసి న‌టించాలంటే చాలా ఎక్జైటింగ్‌గా ఉంది...
రాక్ష‌సుడు నాకు ఎలాంటి పేరు తెచ్చిందంటే...?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.