ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు గర్వించదగ్గ సంఘటన చోటు చేసుకుంది.  మథ్యాహ్నం ఇస్రో శాస్త్ర్ర‌వేత్త‌లు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన చంద్ర‌యాన్ 2ని విజ‌య‌వంతంగా క‌క్ష్య‌లోకి ప్ర‌వేశ పెట్టిన జీఎస్ఎల్‌వీ మార్క్ 3 ఎం 1 వాహ‌కానికి పెట్టారు.  చంద్రయాన్ 2 ప్రయోగం మొదట సాంకేతిక లోపాల వల్ల విఫలం అయ్యింది. నేడు చంద్రయాన్ 2విజయవంతంగా నింగిలోకి నిప్పులు చిమ్ముతూ ఎగసింది. 

ఈ ప్ర‌యోగ్రాన్ని సోమ‌వారం ఇస్రో శాస్త్ర‌వేత్తలు విజ‌య‌వంతంగా నిర్వహించారు. అనంత‌రం చంద్ర‌యాన్ 2పై బాహుబ‌లి ప్ర‌భాస్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా త‌న స్పంద‌న‌ను తెలియ‌జేశారు.హ‌లో డార్లింగ్స్‌, చంద్ర‌యాన్ 2 ప్ర‌యోగం విజ‌య‌వంతంగా కావడం ప‌ట్ల యావ‌త్ భారతీయులు గ‌ర్వ‌ప‌డుతున్నారు. చంద్ర‌యాన్2ను క్ష‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్టిన వాహ‌కానికి బాహుబ‌లి అనే పేరు పెట్టడం గౌర‌వంగా భావిస్తున్నాను. 300 వంద‌ల ట‌న్నుల బ‌రువైన చంద్ర‌యాన్ 2ను ప్ర‌యోగించ‌డం వెనుక ఎన్నో ఏళ్ల కృషి ఉంది`` అన్నారు.

అంతే కాదు తాను బాహబలి సినిమాతో ఎంత గొప్ప సక్సెస్ సాధించానో..ఇప్పుడు భారత చరిత్రలో చంద్రయాన్ 2 అంత గొప్ప చరిత్ర సృష్టించించిదని ప్రభాస్ పేర్కొన్నారు. బాహుబలి చిత్ర యూనిట్ వారి అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి ఇస్రో శాస్త్రవేత్తలకు థాంక్స్ చెబుతూ, చంద్రయాన్ 2 వాహకానికి తమ సినిమా పేరు పెట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నామని తెలియజేశారు. 
 Proud that @ISRO's #Chandrayaan2 took flight today. We are extremely overwhelmed to know that it is a termed as #Baahubali for its scale and the effort that went into making it happen. Couldn't be happier. Congratulations on the successful launch..🔥🔥👏🏻 pic.twitter.com/gEw6uTdql2

మరింత సమాచారం తెలుసుకోండి: