మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ మూవీలో మంచి మాస్ మసాలా సాంగ్ ‘రత్తాలు రత్తాలు’అంటూ రాయ్ లక్ష్మీ తో చిందులు వేశారు.  ఈ పాట అప్పట్లో మంచి పాపులర్ సాంగ్ అయ్యింది.  దాంతో ఇప్పుడు టాలీవుడ్ లో రాయ్ లక్ష్మీని రత్తాలు అంటూ పిలుస్తున్నారు.  రాయ్ లక్ష్మి హీరోయిన్ గానే కాకుండా ఐటమ్ సాంగ్స్ లో ఎక్కువగా నటిస్తుంది. 

ఆ మద్య వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ లాంటి హర్రర్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించినా పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేక పోయింది ఈ బెంగళూరు భామ.  తన బాడీషేప్‌తో పాటు మనసు కూడా తేలికగా మారిందని అమ్మడు చెబుతోంది. ప్రస్తుతం ఆమె ‘సిండ్రిల్లా’ మూవీలో నటిస్తోంది. ఒక్క హిట్ సినిమా అయినా తన ఖాతాలో వేసుకోక పోతానా తెగ ఎదురు చూస్తుంది.

ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనా తాను మాత్రం మంచి హిట్‌ కోసం వెయిట్‌ చేస్తూనే వుంది. ఈ మద్య తన వంపు సొంపుల అందాలు ఫోటో షూట్స్  రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ యూత్ కి పిచ్చెక్కిస్తుంది.  ప్రస్తుతం ‘సిండ్రిల్లా’ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో బికినీలో ఫోజు ఇస్తూ తీసిన ఫోటోను పోస్ట్‌ చేసింది.  తన బాడీ బికినీ షేప్‌కు మారిందని, బాడితో పాటు మనసు కూడా చాలా తేలికగా వుందని పోస్ట్‌ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: