నాని హీరోగా  విక్రమ్ కుమార్ దర్శకుడిగా 'గ్యాంగ్ లీడర్' రాబోతున్న సంగతి తెలిసిందే.  అయితే  'గ్యాంగ్ లీడర్' అంటేనే పక్కా మాస్ టైటిల్.  తెలుగు రాష్ట్రాల వరకూ ఈ టైటిల్ బాగానే ఉంటుంది గాని, ఓవర్సీస్ లో ఈ టైటిల్ ఎంతవరకూ  వర్కౌట్ అవుతుంది.   సినిమా టైటిల్ ను బట్టే.. ఆ సినిమా పై ప్రేక్షకులు  ఆసక్తి పెంచుకుంటున్న ఈ రోజుల్లో ఇలాంటి టైటిల్ పెట్టడం అవసరమా?   టైటిల్ విషయంలో అప్పట్లో  నాని పై ట్రోల్ కూడా చేశారు మెగా ఫ్యాన్స్. అయినప్పటికీ   'గ్యాంగ్ లీడర్' టీమ్ మాత్రం తమ సినిమాకు అదే టైటిల్ అని తీర్మానం చేసేసింది.  


మరి సినిమాలో టైటిల్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటో గాని.. మొత్తానికి టైటిల్ అయితే ఓవర్సీస్ లో అంత త్వరగా రీచ్ అయ్యేలా కనిపించట్లేదు. గత సినిమాల అనుభవం రీత్యా  ఓవర్సీస్ లో క్లాస్ అండ్ కామిక్  టైటిల్స్ కు ఉండే  క్రేజ్..   మాస్ టైటిల్స్ అంత త్వరగా ఉండదు. అందుకు ఉదాహరణ మొన్న వచ్చి హిట్ అనిపించుకున్న 'ఇస్మార్ట్ శంకరే'.  దీని బట్టి  సినిమా రిజల్ట్ పై..  ఇలాంటి టైటిల్ బాగానే  ప్రభావం చూపిస్తుంది అనుకోవాలి.  


ఇక  ఈ సినిమాలో నాని సరసన  చెన్నై బ్యూటీ మేఘా ఆకాష్,  ప్రియాంక అరుళ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే 'ఆర్ఎక్స్ 100' హీరో  కార్తికేయ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు.  అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను   మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: