సినీరంగంలో అందమే ప్రధానం.. ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి అందాన్ని కాపాడుకోవాల్సిందే.. అంతే కాదు.. హీరోయిన్లు, లేడీ సెలబ్రెటీలు పెళ్లయినంత వరకే వారి హవా కొనసాగుతుంది..


ఒక్కసారి హీరోయిన్ కు పెళ్లయిందంటే.. ఆమె చాప్టర్ క్లోజ్ అని చాలా మంది భావిస్తారు. కానీ అదంతా నిజం కాదు.. గ్లామర్, టాలెంట్ ఉంటే.. పెళ్లయి, పిల్లలున్నా ఆకట్టుకోవచ్చని యాంకర్ అనసూయ నిరూపిస్తోంది.


అంతే కాదు.. తనకు పెళ్లయిందని.. తనకు భర్త, పిల్లలు ఉన్నారని చెప్పుకునేందుకు ఆమె ఎక్కడా వెనుకాడదు. ఆ విషయాన్ని గర్వంగా చెబుతుంది కూడా. తాను జీవితంలో పొందిన వాటిని చూసి సిగ్గుపడటం లేదు. గర్వపడుతోంది. తాను సాధించినవాటిని అందరికీ చూపించాలనుకుంటోంది.


తాను పొందిన వాటిలో అన్నింటికంటే గొప్పది తన కుటుంబమేనట. మనం రాత్రింబవళ్లు పనిచేసేది ఇంటికెళ్లాక కుటుంబంతో కలిసి ఆనందంగా గడపడానికే కదా..? పనిచేస్తున్న ప్రదేశంలో మగవారికి లేని హద్దులు ఆడవారికెందుకు ? అంటూ ప్రశ్నిస్తున్న అనసూయను శభాష్ అనకుండా ఉండలేం కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: