స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా  మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న  భారీ బడ్జెట్ చిత్రం 'సైరా'. కాగా  అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా విడుదలకానున్న విషయం తెలిసిందే.  ఈ తేదీని చిత్ర యూనిట్ చాలా రోజుల క్రితమే ఫైనల్ చేసుకుంది. మెగాస్టార్ సినిమా కావడం,  పైగా సినిమా పై భారీ అంచనాలు ఉండటంతో  అక్టోబర్ 2న పూర్తిగా చిరంజీవికే వదిలేశారు తెలుగు స్టార్ హీరోలందరూ.   


అయితే  బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ మాత్రం  అక్టోబర్ 2న  తమ సినిమా విడుదలవుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే.  వీరిద్దరూ కలిసి నటించిన హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ 'వార్' హిందీతో పాటు తెలుగులో కూడా అక్టోబర్ 2నే  రానుంది. కానీ  'సైరా' దెబ్బకి ఈ సినిమా పోస్ట్ ఫోన్ అవుతుందని మొదట అనుకున్నప్పటికీ.. వార్ సినిమాని అనుకున్న డేట్ కే.. మెగాస్టార్ కి పోటీగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 

సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం  హిందీ, తమిళంలో 'సైరా'కి ఏ రేంజ్ పోటీ ఇస్తోందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: