Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 4:11 am IST

Menu &Sections

Search

సూర్య `బందోబస్త్`తో మరో గొప్ప విజ‌యాన్ని సాధిస్తాడు - సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌

 సూర్య `బందోబస్త్`తో మరో గొప్ప విజ‌యాన్ని సాధిస్తాడు - సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌
సూర్య `బందోబస్త్`తో మరో గొప్ప విజ‌యాన్ని సాధిస్తాడు - సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రతి సినిమాకు స్టయిల్ చేంజ్ చేసే హీరోల్లో సూర్య ఒకరు. ప్రతిసారీ కొత్తగా కనిపించాలని, ప్రేక్షకులకు డిఫరెంట్ సినిమాలు అందించాలని ప్రయత్నిస్తారు. ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. 'సింగం' వంటి పక్కా కమర్షియల్ సినిమాలు... 'గజినీ', 'సెవెన్త్ సెన్స్', '24' వంటి డిఫరెంట్ సినిమాలు... 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' వంటి లవ్ స్టోరీలు చేయడం ఆయనకు మాత్రమే సాటి. ప్రస్తుతం సూర్య నటిస్తున్న తమిళ సినిమా 'కప్పాన్'. తెలుగులో ఈ సినిమా 'బందోబస్త్'గా ప్రేక్షకుల ముందుకొస్తుంది. హేరీశ్ జైరాజ్ సంగీతం అందించిన ఈ సినిమా పాట‌ల‌ను ఆదివారం విడుద‌ల చేశారు. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ముఖ్య అతిథిగా హాజ‌రై ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...


సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ మాట్లాడుతూ - ``శివాజీ సినిమాలో నాతో కె.వి.ఆనంద్‌గారు ప‌నిచేశారు. ఆ సినిమా నేను శంక‌ర్‌తో చేయ‌డానికి కార‌ణ‌మైన వ్య‌క్తుల్లో కె.వి.ఆనంద్‌గారు ఒక‌రు. ఆయ‌న‌కు క‌థ‌పై మంచి జ‌డ్జ్‌మెంట్ ఉంటుంది. ఆయ‌న‌తో నేను ఒక సినిమా చేయాల్సింది. కానీ.. కొన్ని ప‌రిస్థితుల్లో అది కుద‌ర‌లేదు. ఇక మోహ‌న్‌లాల్‌గారు ఈ సినిమాలో మంచి పాత్ర‌లో న‌టించారు. ఆయ‌న గొప్ప న‌టుడే కాదు.. గొప్ప మ‌న‌సున్న వ్య‌క్తి. అలాగే ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించిన ఆర్య‌.. న‌ట‌న‌ను 'నేను దేవుణ్ణి' సినిమాలో చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. అంత గొప్ప‌గా న‌టించారు. ఇక హేరీశ్ జైరాజ్‌గారు.. మ్యూజిక్ చాలా బావుంది. ఆయ‌న సంగీతం అందించిన సినిమాల్లో 'చెలి'లోని మ‌నోహ‌రా... సాంగ్ నాకు బాగా ఇష్ట‌మైన సాంగ్‌. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే సుభాస్క‌రన్ గురించి చెప్పాలంటే... ఆయ‌న మ‌న‌కు దేవుడిచ్చిన వ‌రం. ఎందుకంటే ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో సగం మంది ఆయన సినిమాల్లోనే ప‌నిచేస్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్లో 'ఇండియ‌న్‌ 2' సినిమాను చేస్తున్నారు. అది త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది. అలాగే 60 ఏళ్లుగా ఎంజిఆర్‌గారి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఎంద‌రో చేయాల‌నుకుంటున్న 'పొన్నియ‌న్ సెల్వ‌న్' సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే నేను, మురుగ‌దాస్‌గారు క‌లిసి చేస్తోన్న 'ద‌ర్బార్' సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సూర్య గురించి చెప్పాలంటే ఆయ‌న తండ్రి శివ‌కుమార్‌గారి గురించి చెప్పాలి. త‌న స‌హ‌న‌టులు ఎవ‌రికీ చెడ్డ పేరు రాకూడ‌ద‌నుకునే వ్య‌క్తి ఆయ‌న‌. ఆయ‌న సూర్య, కార్తిని చక్కగా పెంచి పెద్ద‌చేశారు. కార్తి తొలి సినిమా 'ప‌రుత్తి వీర‌న్‌' (మ‌ల్లిగాడు)లో అద్భుతంగా న‌టించాడు. కానీ సూర్య న‌టించిన తొలి సినిమా చూసి ఇత‌న‌కు న‌టించ‌డానికి రావడం లేదే అనుకున్నాను. కానీ ఆయ‌న త‌న‌ను తాను మ‌లుచుకుని ఈ స్థాయికి వ‌చ్చినిల‌బ‌డ్డారు. `శివపుత్రుడు`, 'సింగం', 'సింగం2స‌, `వీడొక్కడే`, 'గ‌జిని' వంటి ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ఆయ‌న త‌ప్ప మ‌రెవ‌రూ చేయ‌లేర‌నేంత గొప్ప‌గా న‌టించారు. ఆయ‌న రీసెంట్‌గా ఎడ్యుకేష‌న్ సిస్టంపై చేసిన వ్యాఖ్య‌ల‌ను కొంద‌రు త‌ప్పు ప‌ట్టారు. ఆయన‌కేం అర్హత ఉంద‌ని ప్ర‌శ్నించారు. కానీ.. అగ‌రం ఫౌండేష‌న్‌ను స్థాపించి ఎంద‌రికో విద్య‌ను అందిస్తున్న సూర్య అక్క‌డి పిల్ల‌లు పడే క‌ష్టాన్ని క‌ళ్లారా చూసుంటాడు. అందువ‌ల్లే త‌ను అలా స్పందించాడు. త‌న వ్యాఖ్య‌ల‌ను నేను స‌మ‌ర్ధిస్తున్నాను. త‌ను ఆ విష‌యంపై మాట్లాడ‌టానికి పూర్తిగా అర్హుడు. 


సూర్య ఇంకా `బందోబస్త్' వంటి సినిమాలే కాదు. ఎన్నో గొప్ప సినిమాలు చేసి ఇంకా ప్ర‌జాభిమానం పొందాలి. త‌ర్వాత ఆయ‌న అవ‌స‌రం త‌ప్ప‌కుండా ప్ర‌జ‌ల‌కు ఉంటుంద‌ని నేను భావిస్తున్నాను. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలి. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు`` అన్నారు. 


హీరో సూర్య మాట్లాడుతూ - ``నా బ‌ల‌మేంటి? అని ఎవ‌రైనా అడిగితే.. మ‌రో ఆలోచ‌న లేకుండా ఫ్యాన్స్ అనే చెబుతాను. ఈ 'బందోబ‌స్త్' చిత్ర ఆడియో కోసం హేరీశ్ ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో తెలుసు. త‌న‌తో నేను చేస్తోన్న 9వ సినిమా. ఇక కె.వి.ఆనంద్‌గారితో నా జ‌ర్నీ ఎప్ప‌టి నుండో కొన‌సాగుతుందో ప్రేక్షకులకు తెలుసు. ఆయ‌న‌తో 'అయాన్‌' (వీడొక్క‌డే), 'మాట్రాన్‌' (బ్ర‌ద‌ర్స్‌) చిత్రాలు చేశాను. ఇది మా క‌ల‌యిక‌లో వ‌స్తోన్న మూడో సినిమా. ఆయ‌న గొప్ప ప‌ని రాక్ష‌సుడు. అంద‌రినీ మెప్పించే సినిమా దీన్ని మ‌లిచాడు. ఇందులో నేను స్పెష‌ల్ ప్రొటెక్ష‌న్ గ్రూప్ సభ్యుడి పాత్ర‌లో న‌టించాను. ఈ సినిమా ఇంత గొప్ప‌గా వ‌చ్చిందంటే ముందుగా నిర్మాత సుభాస్క‌రన్‌గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సినిమాలో మోహ‌న్‌లాల్‌గారితో క‌లిసి న‌టించ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ఒక అన్న‌లా ఆద‌రించారు. ఎన్నో కొత్త విష‌యాల‌ను చెప్పారు. ఆయ‌న‌తో కలిసి 25 రోజుల పాటు ప‌నిచేశాను. ఇది నాకు ఎంతో ఇంపార్టెంట్ సినిమా. అలాగే... సినిమాలో ఆర్య‌, స‌యేషా జంట మంచి న‌ట‌న‌ కన‌ప‌రిచారు. ఈ సినిమాలో ఆర్య ఉన్న‌ప్ప‌టికీ నేను స‌యేషాతో జంట‌గా న‌టించాను. కొంత బాధగా అనిపించినా సినిమా కాబ‌ట్టి త‌ప్ప‌లేదు. ప్రేక్ష‌కులు న‌న్ను ఇంతలా ఆశీర్వ‌దిస్తార‌ని నేను క‌ల‌లో కూడా అనుకోలేదు. మ‌న ప్ర‌య‌త్నం త‌ప్పుకావ‌చ్చు. కానీ.. ప్ర‌య‌త్నాలు చేయ‌డం మాత్రం మానుకోకూడ‌దు. అంద‌రూ అలాగే క‌ష్ట‌ప‌డితే, త‌ప్ప‌కుండా స‌క్సెస్ వ‌స్తుంది. గొప్ప గొప్ప‌వారికే జ‌యాప‌జ‌యాలు త‌ప్ప‌లేదు. ఈ వేడుక‌కి ముఖ్య అతిథిగా వ‌చ్చిన ర‌జనీకాంత్‌గారికి థ్యాంక్స్‌. ఆయ‌న చెప్పిన‌ట్లు ఆయ‌న దారి ఎప్పుడూ ర‌హ‌దారే. ఆయ‌న ఒక తెరిచిన పుస్త‌కం. ఆయ‌న దారిలో మ‌రొక‌రు రాలేరు. రియ‌ల్ లైఫ్‌లో ఆయ‌నొక హీరో అనే సంగ‌తి మ‌న‌కు తెల‌సిందే. ఇక ఇదే వేడుక‌కి మ‌నల్ని ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చిన శంక‌ర్‌గారు ప్ర‌తి సినిమాతో మ‌న సినిమాల‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళుతున్నారు. 'స‌క్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టిని.. స‌క్సెస్ ఈజ్ ఏ జ‌ర్నీ' అని నేను బాగా న‌మ్ముతాను. నేను నా అభిమానుల‌కు చెప్పేదొక్క‌టే ముందు మీరు, మీకుటుంబం.. త‌ర్వాతే మ‌న స‌మాజం గురించి ఆలోచించండి.. ఏదీ ప్ర‌క‌ట‌నల కోసం మాత్రం చేయ‌వ‌ద్దు`` అన్నారు. 


కంప్లీట్‌ యాక్ట‌ర్ మోహ‌న్‌లాల్ మాట్లాడుతూ - ``లైకా సుభాస్క‌ర‌న్‌గారికి, డైరెక్ట‌ర్ కె.వి.ఆనంద్ గారికి, నా డార్లింగ్ సూర్య‌కు ముందుగా అభినంద‌న‌లు. కె.వి.ఆనంద్ డైరెక్ట‌ర్‌గా కాకుండా కెమెరామెన్‌గా వ‌ర్క్ చేసేట‌ప్ప‌టి నుండి నా సినిమాల‌కు ప‌నిచేశారు. అవార్డుల‌ను కూడా అందుకున్నారు. న‌టుడిగా నా 41వ సంవ‌త్స‌రం జ‌ర్నీ ఇది. డేడికేష‌న్‌, న‌టీన‌టులు పెర్ఫామెన్స్‌, ప్యాష‌న్‌తో చేసిన ఈ `బందోబస్త్కా` సినిమాకు పైనున్న దేవుడు అండ‌గా నిలుస్తాడు`` అన్నారు. 


స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ మాట్లాడుతూ - ``చాలా మంచి టీమ్‌కుదిరింది. సూప‌ర్‌హిట్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు ఉండాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. క‌థ‌, పెర్ఫామెన్స్‌, యాక్ష‌న్‌, విజువ‌ల్స్‌, మ్యూజిక్ ఇలా అన్ని అద్భుతంగా కుదిరాయి. తెర‌పై సూర్య‌, కె.వి.ఆనంద్‌గారి కష్టం క‌న‌ప‌డుతుంది. కె.వి.ఆనంద్‌గారు నా ద‌గ్గ‌ర ప‌నిచేసేట‌ప్పుడు సీన్ బాగా రావ‌డానికి ఎంత ఆలోచిస్తారో నాకు తెలుసు. సూర్య రాను రానూ యువ‌కుడిలా మారుతున్నారు. ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్‌.. డేడికేష‌న్ ఉన్న న‌టుడు. ఈ సినిమా త‌న‌కు వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మాస్ సినిమాగా నిలిచిపోవాల‌ని కోరుకుంటున్నాను. సుభాస్క‌రన్ వంటి ప్యాష‌నేట్ ప్రొడ్యూస‌ర్ ఈ సినిమాకు నిర్మాత కావ‌డం ఆనందించ‌ద‌గ్గ విష‌యం. `బందోబస్త్' వంటి మంచి చిత్రాల‌ను మ‌రిన్నింటిని ఆయ‌న నిర్మించాల‌ని కోరుకుంటున్నాను. హేరీశ్ జైరాజ్ సూప‌ర్బ్ మ్యూజిక్ అందించాడు. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు. 


rajanikanth
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప‌న్నెండు గంట‌లు నీళ్ళ‌లో ఉండిపోయాను
అబ్బూరి ర‌విని అలా పిలిస్తే కొడ‌తాడంట‌...?
కృష్ణాన‌గ‌ర్ క‌ష్టాలు చాలా అనుభ‌వించాను
ఇన్ని సినిమాలు ఒకేరోజు రిలీజ్‌... ఎన్ని ఆడ‌తాయో...?
ఈ "గ్యాంగ్ లీడర్" కి చిరుతో పోటీ సాధ్య‌మేనా...?
‘చదివిందేమో టెన్త్‌రో... అయ్యిందేమో డాక్టరో’ అంటున్న నందితాశ్వేత‌
'రాజావారు రాణిగారు' 'నమ్మేలా లేదే..కల కాదే..
న‌ట‌కిరీటి గురించి  ఐశ్వ‌ర్య అలా అందేంటి
నా బాధ‌ల‌కి ఈ టైటిల్‌కి సంబంధం లేదు
సిగరెట్ తాగిన రావణాసురుడు: ఎస్వీఆర్ కు బామ్మ ఝలక్ ?
జగన్ డల్లాస్ గొడవ :  ఓహో.. అసలు సంగతి ఇదా..?
ప్లీజ్ అనుష్క పెళ్లి చేసుకోవా...ప్ర‌భాస్‌
చ‌ర‌ణ్‌కు బాలీవుడ్  అయితే ఎన్టీఆర్‌కు హాలీవుడ్
24 గంటల్లో.. 23 మిలియన్ల వ్యూస్‌తో దుమ్మురేపిన సైరా టీజర్...
ప‌వ‌న్‌ను టార్గెట్ చేస్తే వైసీపీకే న‌ష్ట‌మా...?
ఐశ్వ‌ర్య‌తో క‌లిసి న‌టించాలంటే చాలా ఎక్జైటింగ్‌గా ఉంది...
రాక్ష‌సుడు నాకు ఎలాంటి పేరు తెచ్చిందంటే...?
డీ సినిమాను తలదన్నే  డిజిటల్ సర్వీస్ ఇక‌ పైరసీలు క‌ష్ట‌మేనా?
ఒకే వేదిక పై ఏసుదాస్‌, బాలు, చిత్ర చూసి తీరాల్సిందేగా..!
ద‌ర్శ‌క దిగ్గ‌జం చెప్పిన పావ‌లా సీక్రెట్ ఇప్ప‌టికీ షాకింగే...!
బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే ల‌వ్ మ్యారేజ్ చేసుకున్న డేరింగ్ హ‌రోయిన్‌
యూట్యూబ్‌ను ర‌ఫ్ ఆడిస్తున్న టాలీవుడ్ మూవీస్‌
బాల‌ల చిత్రాల వెనుక ఇంత క‌థ ఉందా...!
మెగాస్టార్ విశ్వరూపం.. పవర్ స్టార్ సింహగర్జన..
నివాసి.. తండ్రీకొడుకుల భావోద్వేగం కథ.. మెప్పిస్తుందా..?
నిన్నుత‌ల‌చి ప్రేక్ష‌కులు త‌ల‌చుకుంటారా...?
'దర్పణం'.. లో సస్పెన్స్ ఇంత ఉందా...!
బాల‌య్య సూట్‌లో భ‌లే ఉన్నాడే...!
హాలీవుడ్ స్టైల్.. సాహో కొంప ముంచుతుందా..?
ఈ కథతో రాజశేఖర్‌ కు మరో హిట్ గ్యారెంటీనా..?
మంచు లక్ష్మి కి ఆ 9 కీ లింక్ ఏంటీ?
ఆ హీరోల అందం వెనుక.. అసలు కథ..?
కళ్యాణ్ రామ్... నిజంగా అంత మంచి వాడా ?
కళ్యాణ్ రామ్... నిజంగా అంత మంచి వాడా ?
 ప్ర‌భాస్ క్రేజ్ చూసి షాక్ అయిన శ్ర‌ద్ధాక‌పూర్‌
ఆ నిర్మాత కొడుకు చూసీ చూడంగానే` ప‌డిపోయాడు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.