తెలుగు బిగ్ బాస్ 3 ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 ట్రేండింగ్ షో, ప్రపంచమంతా తెలుగు బిగ్ బాస్ షో వైపు చూస్తోంది. అలాంటి ఈ బిగ్ బాస్ షో లో పాల్గొనేకి కొంతమంది తారలు ఏమైనా చేస్తారు. ఆ షో లో ఉండే కొన్ని నియమ నిబంధనలకు కట్టుబడి ఎంతమంది ఎన్నిసార్లు ప్రశ్నలు వేసిన ఎవరి ఏమి చెప్పారు. 


కారణం నియమ నిబంధనలు పాటించకపోతే బిగ్ బాస్ కి నచ్చదు. ఈ నేపథ్యంలోనే బ్యూటీఫుల్ శ్రీముఖి ఇటీవలే ఫోటో షూట్స్ చేసి ఆ ఫోటోలలో ఎంతో అందంగా కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఆ ఫోటో షూట్స్ అన్ని సినిమాలలో ఛాన్సుల కోసం చేస్తుంది ఏమో అనుకున్నారు చాలామంది. అప్పటికి కొంతమంది అడుగుతూనే ఉన్నారు బిగ్ బాస్ లో వెళ్తున్నారు కదా అని, కానీ శ్రీ ముఖి చెప్పలేదు. 


ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ ఇలా అన్నిటిలో ఎన్నోసార్లు లైవ్ లోకి వచ్చిన, ఎంతమంది బిగ్ బాస్ లోకి వెళ్తున్నారా అని అడిగిన చెప్పలేదు. కానీ నిన్న ప్రారంభమైన బిగ్ బాస్ షో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ ఊహించినట్టే బిగ్ బాస్ 13వ కంటస్టెంట్ గా శ్రీముఖి 'షో'కి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఫ్యాన్స్ కోసం ఒక వీడియో కూడా ట్విట్టర్ లో రిలీజ్ చేసింది. 


బిగ్ బాస్ వెళ్లేముందు ఆమె హౌస్ లోకి వెళ్లనున్నట్టు ముందే ఫ్యాన్స్ కు చెప్పాలని అనుకున్నని అయితే, బిగ్‌బాస్‌ కండిషన్స్ వల్ల ఈ విషయాన్ని చెప్పలేకపోయానని చెప్పిన శ్రీముఖి, ఈ వీడియో మీ ముందుకు వచ్చే సమయానికి ఒక ఎపిసోడ్డ్ టెలికాస్ట్ అయిపోయి ఉంటుందని కూడా పేర్కొంది. ప్రామిస్ గా ఆమె బోలెండంత ఎంటర్ టెయిన్ చేస్తానని, తనకు మద్దతు ఇవ్వాలని ప్రేక్షకులను కోరింది. అయితే ఈ వీడియోకి స్పందించిన నెటిజన్లు కొంతమంది 'మాకు ముందే తెలుసు శ్రీ నువ్వు వెళ్తావ్' అని ట్విట్ చేస్తే, మరికొందరు మాత్రం ''మమ్మల్ని శ్రీముఖి మోసం చేసింది' అంటూ కామెంట్లు చేశారు. ఏది ఏమైనా శ్రీముఖి ఫ్యాన్స్ ని బిగ్ బాస్ లో ఎంత ఎంటర్ టెయిన్ చేస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: