ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ సైరా నరసింహారెడ్డి. తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వాస్తవిక జీవితం ఆధారంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాపై మెగాఫ్యాన్స్ తోపాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ విపరీతమైన అంచనాలున్నాయి. మెగాస్టార్ తొలిసారి ఒక స్వతంత్ర సమరయోధుడిగా విభిన్నమైన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ గత ఏడాది చిరంజీవి జన్మదిన కానుకగా విడుదలై అత్యధిక వ్యూస్ మరియు లైక్స్ సాధించి మంచి రెస్పాన్స్ సంపాదించిన విషయం తెలిసిందే. 

ఇక ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాలూకు డబ్బింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయట. ఇప్పటికే అనుకున్న తేదికి రావలసిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడడంతో, ఈసారి ఎట్టిపరిస్థితుల్లో సినిమాను అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా గట్టిగా ప్లాన్ చేస్తోందట సినిమా యూనిట్. ఇక గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఈ సినిమా ట్రైలర్ ని గ్రాండ్ లెవెల్ లో లాంచ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈమేరకు అప్పుడే ట్రైలర్ కోసం సినిమాలోని కొన్ని సన్నివేశాలు కట్ చేయడం జరిగిందని, ఇక ట్రైలర్ విడుదల తరువాత సినిమాపై అంచనాలు మరింతగా పెరగడం ఖాయమని సినిమా యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోందట. 

ఇక ఈ సినిమా ట్రైలర్ విషయమై మరికొద్దిరోజుల్లో ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు సమాచారం. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మరి ప్రస్తుతం విపరీతంగా పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే, మెగాస్టార్ బర్త్ డే రోజున అయన ఫ్యాన్స్ కు పెద్ద కానుక లభించినట్లే......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: