రొటీన్‌కి భిన్నంగా ఉండే సినిమాల‌ను ఎంచుకోవ‌డంలో త‌మ్మారెడ్డి స్టైల్. తమిళ్‌లో డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన చిత్రం  'ఆడై'. ఈ చిత్రం తెలుగులో ఆమెగా తీశారు. సెన్సేష‌న‌ల్  హీరోయిన్ అమ‌లాపాల్ లీడ్ రోల్ చేసింది. ర‌త్న‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ఫ‌స్ట్ లుక్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. అమ‌లా పాల్ బోల్డ్ లుక్ కూడా సంచ‌ల‌నం సృష్టించింది. ప్ర‌దీప్ కుమార్ ఆమె చిత్రానికి సంగీతం అందించారు.  విజ‌య్ కార్తిక్ క‌న్న‌న్ కెమెరా హ్యాండిల్ చేశారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ్ ఈ చిత్ర తెలుగు హ‌క్కులను సొంతం చేసుకొని  చ‌రిత‌ చిత్ర ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లో జులై 19న ఈ సినిమాను విడుద‌ల  చేశారు. సినిమా కు మంచి మార్కులే పడ్డా..  కల్లెక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగా వస్తున్నాయి. అందుకు కారణా లను  వివరించడానికి తమ్మారెడ్డి భరద్వాజ్ విలేకరులతో ముచ్చటించారు.  ఆ కారణాలు ఆయన మాటల్లోనే..

ఆమె సినిమాను ఎంతో నచ్చి తీసుకున్నాను. ఒక అమ్మాయిని ఎవరైనా తాకినా..15సెక‌న్ల‌ పాటు తదేకంగా చూసినా కేసు అవుతుందని తెలిసిందే.. అలాంటిది ఈ సినిమాలో ఒక అమ్మాయి తాగిన మైకం లో బట్టలు విప్పేస్తా అని చెప్పినప్పుడు మైకం దిగాక ఆ పని నిజంగానే చేయాల్సి వస్తే.. దాని పరిణామం ఏంటి అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. అదే నాకు డిఫరెంట్ గా అనిపించింది. కొత్త పాయింట్ తో వస్తున్నాం కదా అని నచ్చి నేను  తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అయితే తమిళ నాట కొంత మంది మోసపూరిత ప్రవర్తనల వలన సినిమా సరిగా రీచ్ అవలేకపోయింది. ఇక ఇక్కడ విషయానికి వస్తే... సరైన సమయం చూసుకోకుండా విడుదల చేయడంతో.. ఆడియన్స్ థియేటర్స్ కు వచ్చే అవకాశం తగ్గింది. అందులోనూ అదే రోజున దర్శకుడు పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ విడుదల కావడం, ఆ సినిమాలో ఎంటర్‌టైన్మెంట్ ఉండటం, యూత్ ను ఆకర్షించడం వలన అందరూ ఆ  సినిమా వైపు మొగ్గు చూపారు. దాంతో ఆమె కు కాస్త కలెక్షన్స్  తగ్గాయి. ఏది ఏమైనా 'ఆమె' సినిమా కంటెంట్ ఉన్న సినిమా..  ప్రతి తల్లి తండ్రులు, పిల్లలు ముఖ్యంగా  ఆడపిల్లలు చూడవలసిన సినిమా ఇది. సమాజానికి ఉపయోగపడే సినిమా అని ఘంటా  పథంగా చెప్పగలను.

సినిమా థియేటర్లోనే చూడమని చెప్ప్పడం లేదు.. టీవీ లోనో, యు ట్యూబ్ లోనైనా సరే తప్పకుండా చూడాలని కోరుకుంటున్నా.. ఇక ఈ సినిమా లో నటించిన అమల పాల్ గురుంచి చెప్పాలంటే ఈమె ఈ సినిమా కోసం ఎంతో కష్టపడింది. పాత్ర కోసం ఒంటిమీద  నూలుపోగు కూడా లేకుండా నటించింది. నటిగా తనను తానూ ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో శ్రమించింది. అయితే కొందరు తమిళ ప్రొడ్యూసర్స్  వలన విడుదల విషయంలో నష్టం వాటిల్లింది. అందుకు అమలా పాల్ తన రెమ్యునరేషన్ ను వదులుకొని ఆ డబ్బు తో  విడుదుల చేయించింది. అమలా పాల్ న్యూడ్ గా నటించడం ఒక ఎత్తు అయితే దాన్ని అసభ్యకరంగా కాకుండా చాలా డీసెంట్ గా చూపించారు దర్శకుడు రత్న కుమార్, మరియు కెమెరా మ్యాన్ విజయ్ కార్తిక్. అందుకు వారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంత మంచి సినిమా అందించినా కూడా ఒక లెసన్ మాత్రం నేర్చుకున్నా.. మంచి సినిమా తీయడం ఇంపార్టెంట్ కాదు తీసిన సినిమాను ప్రాపర్ గా రిలీజ్ చేసేలా చూసుకోవాలని మాత్రం నేర్చుకున్నాను. ఇవాల్టీకి ఈ సినిమా నన్ను డిస్సప్పోయింట్ చేసినా మునుముందు ఆడుతుందేమో చూడాలి అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: