పూరీ జగన్నాథ్-రామ్ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. చాలా కాలంగా పూరీ కాని రామ్...కానీ సరైన హిట్ లేక బాగా డీలా పడిపోయారు. పూరీకైతే యంగ్ హీరోస్ నుండి స్టార్ హీరోస్ దాకా ఎవరు కనీసం కథ వినడానికి కూడా ఆసక్తి చూపించలేదు. అలాంటి టైం లో రాం తో కలిసి పూరీ ఇస్మార్ట్ శంకర్ అంటు సినిమాని మొదలు పెట్టాడు. అయితే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి అందరికి ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా..అసలు ఈ సినిమా హిట్ అవుతుందా..పూరీ పని అయిపోయిందని తెగ కామెంట్స్ చేశారు. అయితే పూరీ మాత్రం ఈ కామెంట్స్ ని ఏమాత్రం పట్టించుకోకుండా రాం తో సెట్స్ పైకి వెళ్ళి పోయాడు. 

ఇంతవరకు ఏ సినిమాకి పనిచేయని విధంగా దాదాపు 95 రోజులు షూటింగ్ చేశాడు. ఫస్ట్ లుక్..ఫస్ట్ టీజర్ నుండి సాంగ్ ప్రోమోస్, థియోట్రికల్ ట్రైలర్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. కంప్లీట్ మాస్ ప్రేక్షకులే లక్ష్యంగా పెట్టుకొని రామ్ గెటప్ తెలంగాణా యాస..పూరీ మార్క్ పంచ్ లు సినిమాపై ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ ని పెంచేశాయి. ఇక సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరి అంచనాలు తప్పి భారీ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఆ తర్వాత కూడా కలెక్షన్ల విషయంలో ఏమాత్రం తగ్గకుండా కిర్రాక్ పుట్టిస్తోంది. 

అందరు అనుకున్నట్టు కేవలం మాస్ ఆడియన్స్ మాత్రమే కాదు క్లాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవడంతో నాలుగు రోజుల్లో దాదాపు 50 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని లేటెస్ట్ న్యూస్. మొత్తానికి ముందు నుంచి అనుకున్నట్టుగానే ఇస్మార్ట్ శంకర్ దర్శకుడికి, హీరోకి, హీరోయిన్స్, నిర్మాత, సంగీత దర్శకుడు..ఇలా వరుసబెట్టి అందరికి ఇస్మార్ట్ హిట్టిచింది. దీంతో పూరీ నెక్స్ట్ సినిమా ఏంటి..ఏ హీరోతో ఉండబోతోందనే చర్చ ఇప్పటికే మొదలైపోయింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: