అక్కినేని వారసుడు అఖిల్ కి తన మొదటి సినిమా నుండి హీరోయిన్ విషయంలో పెద్ద సమస్య వస్తూనే ఉంది. ఇప్పుడు కూడా అదే సమస్య. సాధారణంగా సినిమా ఓపెనింగ్ కు మంచిరోజు చూస్తారు. సెట్స్ పైకి వెళ్లడానికి ముహూర్తం చూస్తారు. కానీ హీరోయిన్ పేరును ప్రకటించడానికి కూడా ఇక్కడ ముహూర్తం చూస్తున్నారట చిత్ర యూనిట్. 
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు అఖిల్. ఇందులో ఓ స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు అనుకున్నారు. కానీ ఎవరూ సెట్ కాలేదు. అందుకని ఎప్పట్లానే అఖిల్ సరసన ఓ కొత్తమ్మాయిని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. 

అందుకు ఇక అమ్మాయిని ఫైనలైజ్ చేశారు కూడా. కానీ ఆ అమ్మాయి పేరును ప్రకటించేందుకు మంచి ముహూర్తం సెట్ అవ్వడం లేదని లేటెస్ట్ న్యూస్. కేవలం హీరోయిన్ ఫైనల్ అవ్వలేదనే కారణంతోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆలస్యమైందన్న సంగతి అందరికి తెలిసిందే. చివరికి హీరోయిన్ ఎవరనే విషయం తేలకుండానే ఫస్ట్ షెడ్యూల్ కూడా ప్రారంభించారు. కేవలం అఖిల్, మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులపై కొన్ని సన్నివేశాలు షూట్ చేశారు. హీరోయిన్ ను అధికారికంగా ప్రకటించిన తర్వాత రెండో షెడ్యూల్ మొదలవుతుంది.

అయితే ఇటు అఖిల్, అటు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్.. ఇద్దరికీ ఈ సినిమా హిట్ ఎంతో కీలకంగా మారింది. వీళ్లిద్దరూ ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిందే. ఎందుకంటే ఇది నాలుగో సినిమా అయినప్పటికి అఖిల్ కి ఒక్క హిట్ కూడా పడలేదు సరి కదా కనీసం యావరేజ్ అన్న సినిమా కూడా లేదు. ఇక ఈ సినిమా ఫెయిల్ అయితే అఖిల్ కు ఇంకో ఛాన్స్ వస్తుందేమో కానీ, బొమ్మరిల్లు భాస్కర్ మాత్రం ఇంటికెళ్లిపోవడం ఖాయం. 



మరింత సమాచారం తెలుసుకోండి: