ఎట్టకేలకు బిగ్ బాస్ షో మొదలైపోయింది. గత కొన్ని రోజుల నుండి తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన బిగ్ బాస్ షో ఇటీవల ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా షో స్టార్ట్ అయింది. దీంతో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ షో కి...అదిరిపోయే ప్రశంసలు దక్కుతున్నాయి. అంతేకాకుండా హౌస్ నెంబర్ గా ఎన్నికైన హాట్ యాంకర్ శ్రీముఖి గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆల్ ది బెస్ట్ అంటూ తమ అభిమానం చాటుకున్నారు.


ఇదే క్రమంలో తాను హౌస్ లోకి ఎందుకు వచ్చాను అన్న విషయంపై ముందుగానే నాగార్జున అడిగిన ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చింది. షో మొదలైన సందర్భంలో హౌస్ లోకి ఎంటర్ అయ్యే క్రమంలో హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున యాంకర్ గా వారంలో అని రోజులు బిజీగా ఉంటాయి. నీవు చేస్తున్న షోలన్ని పక్కన పెట్టేసి బిగ్ బాస్ కు ఎందుకు వచ్చావు అని నాగార్జున ప్రశ్నించారు.


బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చేసింది. ఎలాగైనా ఈ షోలో పాల్గొనాలని అనుకున్నా. అందుకే అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టేసి బిగ్ బాస్ కు వచ్చేశా అని శ్రీముఖి తెలిపింది. అంతేకాకుండా ఎంటర్ టైన్ చేయడానికి హౌస్ లోకి వచ్చినట్లు క్లారిటీ ఇచ్చింది. అభిమానులు తనకు తోడుగా ఉండాలని షో కి రాకముందు విడుదల చేసిన వీడియో లో శ్రీముఖి తెలిపింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: