'అర్జున్ రెడ్డి' సినిమా తో మంచి మార్కెట్ పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ అప్పట్లో ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. తర్వాత చేసిన సినిమాలు వరుసగా హిట్ అవడం ముఖ్యంగా 'మహానటి', 'గీతగోవిందం' లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ అవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు సైతం మతిపోయేలా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు రాబట్టాడు.


ఇటువంటి క్రమంలో తాజాగా నటించిన డియర్ కామ్రేడ్స్ సినిమా ఈ నెల 26 వ తారీఖున విడుదల కానున్న నేపథ్యంలో ఆ సినిమా ట్రైలర్ లో ఉన్నా లిప్ లాక్ సన్నివేశాల గురించి కొంతమంది లబోదిబోమంటున్న క్రమంలో వారికోసం విజయ్ దేవరకొండ ప్రమోషన్ కార్యక్రమాల్లో క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా తన సినిమాల్లో లిప్ లాక్ ద్వారా ఎమోషనల్ ఫీలింగ్ ను వ్యక్త పరచడమని, ఎమోషనల్ సీన్ ల వల్లే నా సినిమాలో లిప్ లాక్ లు ఉంటాయని దానిని కొంతమంది ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారో ఆశ్చర్యంగా ఉందని, తన మూవీస్ లోని లిప్ లాక్ సీన్స్ ఆ మూవీస్ లోని కీలక సందర్భాలలో ఉంటున్నాయని, అందువల్ల వాటిని హైలైట్ చేయడం అనవసరమని వివరణ ఇచ్చారు.


దీంట్లో రాద్దాంతం చేయాల్సిన విషయం ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా భరత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించినట్లు ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు విజయ్ దేవరకొండ. 


మరింత సమాచారం తెలుసుకోండి: