అతి చిన్న వయసులోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కమెడియన్ ఆలీ ఇండస్ట్రీకి వచ్చి నలభై ఏళ్లు అయిన నేపథ్యంలో తన కెరీర్ గురించి తన కెరీర్లో ఎదుర్కొన్న ఆటుపోటులు గురించి అనేక విషయాలు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. స్వతహాగా ఆలీ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హాస్య నటుడిగా మంచి పేరు సంపాదించిన ఆలీ సామాజిక సేవలో కూడా తనకు తగ్గ సహాయాలు చేస్తూ ఉన్నతమైన మనసు ఉన్న వ్యక్తిగా ముఖ్యంగా ఇంటిలో ఉన్న తల్లికి అన్ని విధాల తోడుగా ఉంటూ మంచి కుటుంబ సభ్యుడిగా కూడా రాణిస్తూ వచ్చారు.


ఎంత సక్సెస్ వచ్చిన ఎప్పుడూ కూడా ఉప్పొంగెనే ఉప్పొంగని ఆలీ..తన కెరియర్ లో హీరోగా అవకాశం ఎలా వచ్చిందో అన్న విషయం గురించి బయట పెట్టి మహేష్ అభిమానులకు షాక్ ఇచ్చారు. ఆలీ తన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తనకు హీరో అయ్యే ఛాన్స్ మహేష్ వలనే వచ్చింది అని చమత్కరించారు. అలీ హీరోగా వచ్చిన మొదటి సినిమా యమలీల. యమలీల సినిమాలో తనకు హీరోగా ఎలా అవకాశమొచ్చిందనే విషయమై చెప్పుకొచ్చారు ఆలీ. యమలీల సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.


ఈ సినిమాలో అలీ హీరోగా అనుకోక ముందే ఆ పాత్ర కోసం..ఈ చిత్ర దర్శకుడు అయిన ఎస్వీ కృష్ణారెడ్డి గారు ప్రిన్స్ మహేష్ బాబును దృష్టిలో పెట్టుకునే ఈ కథ సిద్ధం చేసుకున్నారు. ముందుగా కధ చెప్పింది కూడా కృష్ణ గారికే. అయితే ఆ సమయంలో మహేష్ బాబు ఇంకా చదువుకుంటున్న నేపథ్యంలో ఆ సినిమాని కృష్ణగారు రిజెక్ట్ చేయడం జరిగింది. దీంతో ఆ టైములో ఎస్ వి కృష్ణారెడ్డి గారి దృష్టిలో నేను పడ్డాను..మహేష్ బాబు చిన్నవాడు కావడంతో యమలీల అనే సూపర్ సబ్జెక్ట్ ఆ సినిమా చేసే ఛాన్స్ నాకు వచ్చింది అని నవ్వుతూ తెలియజేసారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: