లయన్ కింగ్ తెలుగు డబ్బింగ్ మూవీ ఇపుడు ఒకటే హల్ చల్ చేస్తోంది. నిజానికి సమ్మర్ కి ఈ మూవీ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయినా వెకేషన్ కలెక్షన్లకు తీసిపోనివిధంగా ఈ మూవీ అదరగొట్టే కలెక్షన్లు రాబడుతోంది. దీనికి ఇద్దరే కారణమని అంటున్నారు.


బ్రహ్మానందం, అలీ ఇటీవల టైమ్ లో . వెనకబడ్డారనుకున్న వీళ్లిద్దరు తమ వాయిస్ తో మరోసారి తెలుగునాట నవ్వులు పూయించేసి ఫామ్ లోకి వచ్చేసారు.  ఇప్పుడు అదే విషయం మరోసారి  ప్రూవ్ అయ్యింది. వారిద్దరు కలిసి హాలీవుడ్ చిత్రం ది లయిన్ కింగ్ తెలుగు వెర్షన్ లో డబ్బింగ్ చెప్పారు.  అది ఇపుడు పెద్ద హిట్ అయి కూర్చుంది.


ప్రఖ్యాత డిస్నీ సంస్థ నుంచి టూడీ యానిమేటెడ్‌ సినిమాగా 1994లో విడుదలైంది ‘లయన్‌ కింగ్‌’. ఆ చిత్రం తాజాగా త్రీడీ యానిమేటెడ్‌ సాంకేతికతతో విజువల్‌ ఎఫెక్ట్స్‌ సొబగులద్దుకొని సరికొత్తగా ముస్తాబైంది. జులై 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముఫాసా అనే సింహం, సింహం పిల్ల సింబ, ముంగిస టిమోన్‌, అడవి పంది పుంబా చుట్టూ సాగే కథ ఇది. తెలుగులో ఈ సినిమాకి ప్రముఖ హాస్యనటులు బ్రహ్మానందం, అలీ గాత్రదానం చేశారు. 


ట్రేడ్ వర్గాల  సమాచారం ప్రకారం ఈ చిత్రం మూడు రోజుల్లోనే ఇండియ‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 65 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. అవేంజ‌ర్స్ ఇన్ఫినిటీ వార్, అవేంజ‌ర్స్ ఎండ్ గేమ్ త‌ర్వాత ఇండియాలో అత్య‌ధిక ఓపెనింగ్స్ సాధించిన హాలీవుడ్ సినిమా ఇదే కావ‌డం గొప్ప విషయం. తెలుగులో కూడా ల‌య‌న్ కింగ్ వ‌సూళ్లు భారీగానే ఉండటంతో  డిస్ట్రిబ్యూటర్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. 





మరింత సమాచారం తెలుసుకోండి: