స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ నెల క్రితం పెళ్లి చేసుకున్నాడు. బాబీకి 2005లోనే పెళ్లయింది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన అనంతరం ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. దీనిపై అల్లు బాబీ “నేను పెళ్లి చేసుకున్నాను. నాకు 2005లోనే పెళ్లయింది. అయితే.. 2016లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం. ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించబోతున్నాను. నన్ను ఆశీర్వదించండి” అంటూ గతంలోనే తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

 

ముంబయికి చెందిన నీలా షా అనే యోగా ఇన్ స్ట్రక్టర్ ను బాబీ పెళ్లి చేసుకున్నాడు. ఎప్పటినుంచో లివిన్ రిలేషన్ లో ఉన్న ఇరువురూ ఇప్పుడు ఒకటయ్యారు. ఇందుకు సంబంధించి ఏవో ఒకటో రెండో ఫోటోలు తప్ప ఎటువంటి న్యూస్ బయటకి రాలేదు. చిరంజీవి, అల్లు అర్జున్ ఉన్న ఫోటోలు మాత్రమే బయటకు వచ్చాయి కానీ ఇవి ఎక్కడ దిగినవి అంటూ ఓ క్లారిటీ లేదు. ఇప్పుడు అఫీషియల్ గా వీరి పెళ్లి రిసెప్షన్ వీడియో బయటకు వచ్చింది.

 

ఈ ఫంక్షన్ లో చిరంజీవి, నాగబాబు ఫ్యామిలీ, నీలా కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఇంకా మెహర్ రమేశ్, శరత్ మరార్ తదితరులు హాజరయ్యారు. ఫంక్షన్ ఆద్యంతం ఎంతో గ్రాండ్ గా, సందడిగా జరిగింది.  ఈ వీడియో మీకోసం..


మరింత సమాచారం తెలుసుకోండి: