‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ సక్సస్ తో మంచి జోష్ మీద ఉన్న పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలోని చాలామంది టాప్ హీరోలతో పనిచేసి వారికి గతంలో హిట్స్ ఇచ్చిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ టాప్ హీరోల అలవాట్ల పై కొన్ని ఆసక్తిగల కామెంట్స్ చేసాడు. సాధారణంగా చాలామందికి తెలియని విషయాలు కావడంతో పూరి లీక్ చేసిన విషయాలు ఆ టాప్ హీరోల అభిమానుల మధ్య వైరల్ గా మారాయి. 

ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ తాను గోవాలో తారక్ తో ‘టెంపర్’ మూవీ షూటింగ్‌ చేసే సమయంలో తరుచూ తనను షూటింగ్ పూర్తి కాగానే జూనియర్ తన కారులో ఎక్కించుకుని బయటకు తీసుకు వెళ్ళే వాడని చెపుతూ ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు. తారక్ కు కనీసం 120 కిలోమీటర్ల స్పీడ్ తో కారు నడుపుతాడని చెపుతూ అతడి పక్కన కారు జర్నీ చేసేవారికి చుక్కలు కనపడతాయి అంటూ జోక్ చేసాడు.

ఇక తాను గతంలో అల్లు అర్జున్ తో పనిచేసిన దేశముదురు షూటింగ్ సమయంలో షూటింగ్ అయిపోయాక టీమ్ మొత్తం తింటూ ఎంజాయ్ చేస్తుంటే బన్నీ మాత్రం ఎక్సర్ సైజ్ చేసేవాడనీ అంటూ తామందరం చలికి తట్టుకోలేక దుప్పట్లు కప్పుకుని ఉంటే బన్నీ మాత్రం మైనస్ టెంపరేచర్ లో షర్ట్ లేకుండా డిప్స్ తీసిన విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. ఇదే సందర్భంలో తనకు ఎంతో సన్నిహితుడైన రవితేజ గురించి మాట్లాడుతూ ‘ఇడియట్’ మూవీ షూటింగ్‌ లో రవితేజ హీరోయిన్ రక్షితలు బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్న విషయాలను వివరిస్తూ వారు అలా కొట్టుకునే సమయంలోనే తాను వారితో రొమాంటిక్ సాంగ్ తీసిన విషయాన్ని వివరించాడు.  

ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కు కథ చెప్పి ఒప్పించడం కష్టం అంటూ గతంలో జరిగిన ఒక విషయాన్ని వివరించాడు. పవన్ కు ఒక కథకు సంబంధించి క్లైమాక్స్ చెప్పినప్పుడు ఆ కథ నచ్చలేదు మళ్ళీ మార్చమని చెప్పిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు.  అయితే కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చి అదే కథను అదే క్లైమాక్స్ తో పవన్ కు చెప్పి తాను ఒప్పించిన విషయాన్ని బయట పెడుతూ పవన్ కు ఉన్న మతిమరుపును బయటపెట్టాడు. ఇక చివరిగా బాలకృష్ణ ప్రభాస్ ల గురించి పూరి మరికొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ప్రభాస్ తో ‘బుజ్జిగాడు’ సినిమా తీస్తున్నప్పుడు ప్రభాస్ తనకు నచ్చిన అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ ను తనముందు పెట్టి తినమని పెట్టిన స్వీట్ టార్చర్ గుర్తుకు చేసుకున్నాడు. ఇక బాలకృష్ణ అయితే ఎక్కువగామూవీ షూటింగ్ స్పాట్ లో వచ్చే గ్యాప్ లో భక్తి గురించి జాతకాల గురించి అనేక విషయాలు చేపుతాడనీ తిండి విషయంలో ప్రభాస్ పెట్టె టార్చర్ భక్తి విషయంలో బాలయ్య పెట్టె హింస తట్టుకోవడం అంటూ తాను పనిచేసిన అనేకమంది టాప్ హీరోల వింత అలవాట్లు బయట పెట్టాడు..  



మరింత సమాచారం తెలుసుకోండి: