దర్శకుడు పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ దూకుడు తత్వం పై చేసిన కామెంట్స్ తారక్ అభిమానులకు విపరీతమైన టెన్షన్ కలిగిస్తున్నాయి. జూనియర్ తో తాను గతంలో తీసిన ‘టెంపర్’ మూవీ షూటింగ్ లో ప్రతిరోజు సాయంత్రం తారక్ తనను కారులో ఎక్కించుకుని 120 కిలోమీటర్ల స్పీడ్ తో కారు నడిపినప్పుడు తాను పడ్డ టార్చర్ వివరించాడు పూరి.

జూనియర్ కారు నడుపుతున్న స్పీడ్ తట్టుకోలేక ఎప్పుడో రాబోయే మృత్యువు ఇప్పుడే వచ్చేసిందా అని తాను ఖంగారు పడుతుంటే తారక్ మాత్రం తన భయాన్ని పట్టించుకోకుండా ఎంజాయ్ చేసిన అప్పటి విషయాలను ఇప్పుడు పూరి బయట పెట్టాడు. ఇప్పుడు ఈ విషయాలే జూనియర్ అభిమానులలో కలకలం సృష్టిస్తున్నాయి. 

జూనియర్ తన అభిమానులతో సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ లో మాట్లాడుతూ తమతమ ఇళ్ళకు జాగ్రత్తగా వెళ్ళమని తమ గురించి ఆలోచించే తల్లితండ్రులను బాధ పెట్టవద్దని ప్రమాదాలకు లోనై సమస్యలు తెచ్చుకోవద్దని చెప్పే జూనియర్ ఇలా ఉదాసీనంగా తన కారును ఎందుకు వేగంగా నడుపుతున్నాడు అంటూ అభిమానులు బాధపడుతున్నట్లు టాక్. వాస్తవానికి తారక్ అన్న జానకి రామ్ తండ్రి హరికృష్ణ ఇలా వారంతా తమ కార్లను వేగంగా నడపడం వల్ల ప్రమాదానికి లోనై చనిపోయిన విషయం తెలిసిందే. 

కానీ జూనియర్ ఇంట్లోనే జరిగిన ఈ దురదృష్టకర సంఘటనలు కంటే ముందుగా ‘టెంపర్’ షూటింగ్ జరిగింది. ఆమూవీ విడుదలైన కొద్ది కాలానికి జూనియర్ అన్న జానకి రామ్ గత సంవత్సరం తండ్రి హరికృష్ణ కారు ప్రమాదాలలో మరణించారు. ఇప్పుడు ఈ దురదృష్టకర సంఘటనలు జరిగిన తరువాత జూనియర్ తాను కారు నడిపే పద్దతిని మార్చుకుని ఉంటాడు. అయితే ఒకప్పటి జూనియర్ దూకుడు తత్వాన్ని ఇప్పుడు పూరి గుర్తుకు చేసుకోవడంతో తారక్ ఇప్పటికైనా మారాడా లేదా లేకుంటే మారమని సలహాలు ఇస్తూ అభిమానులు హెచ్చరికలు చేస్తున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: