విజయ్ దేవరకొండ వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు.  ఈ మూవీ జులై 26 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఇప్పటికే సినిమాకు సంబంధించిన అన్ని పూర్తయ్యాయి.  ఈనెల 24 వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్నది.  


అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదిలా ఉంటె, తెలుగు, తమిళంలో సినిమాలు చేసిన విజయ్ కన్ను ఇప్పుడు బాలీవుడ్ పై పడింది.  బాలీవుడ్ లో సినిమాల గురించి అడిగితె.. మంచి కథ దొరికితే తప్పకుండా చేస్తానని అంటున్నాడు.  


అర్జున్ రెడ్డి సినిమా తరువాత ఈ యంగ్ హీరోకు మంచి పేరు వచ్చింది.  హిందీలో ఈ మూవీని కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.  షాహిద్ కపూర్ హీరో. ఈ మూవీ అక్కడ హిట్ కావడంతో విజయ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడు.  


అయితే, విజయ్ ఎంట్రీకి ఎవరు సహకరిస్తారో చూడాలి.  సందీప్ రెడ్డి వంగతో టి సిరీస్ సంస్థ సినిమా చేయాలని అనుకుంటోంది.  ఒకవేళ ఆ సంస్థ తీసే సినిమాలో సందీప్.. విజయ్ దేవరకొండను తీసుకుంటారేమో చూద్దాం.  అదే జరిగితే.. బాలీవుడ్ లో విజయ్ స్థానం సుస్థిరం అయినట్టే.  


మరింత సమాచారం తెలుసుకోండి: