ఒకప్పుడు శంకర్ సినిమాలు విపరీతమైన క్రేజ్ ఉండేది.  సినిమాలు వరసగా హిట్టయ్యేవి.  ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.  రోబో తరువాత ఆ స్థాయి హిట్ శంకర్ రాలేదు.  ఐ, 2పాయింట్ 0 సినిమాలు అనుకున్నంతగా హిట్ కాలేదు.  


భారతీయుడు 2 సినిమా స్టార్ట్ అయ్యి ఆగిపోయింది.  కారణం బడ్జెట్ సమస్యలు.  2పాయింట్ 0 సినిమాకు బడ్జెట్ ఎక్కువ కావడంతో... ఇండియన్ 2 కు లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చారట.  కానీ, అందులో సినిమా చేయడం కుదరదని శంకర్ చెప్పారు.  దీంతో ఆ సినిమాను పక్కన పెట్టారు.  


సూర్యా తో శంకర్ ఇప్పటి వరకు సినిమా చేయలేదు.  అందుకోసమే తక్కువ బడ్జెట్ లోనే లైకా ప్రొడక్షన్స్ లో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.  కాప్పన్ ఆడియో వేడుకలో లైకా ప్రొడక్షన్స్ తో పాటు శంకర్, రజినీకాంత్ కూడా హాజరయ్యారు.  సినిమాను ప్రమోషన్ చేస్తున్నారు.  


సూర్యతో సినిమా దాదాపుగా కన్ఫర్మ్ అయ్యిందని, త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు.  ఈ విషయాన్ని లైకా, శంకర్ లు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.  ఇండియన్ 2 కంటే ముందు ఈ సినిమాను కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తారని మరో టాక్.  


మరింత సమాచారం తెలుసుకోండి: