నేచురల్ స్టార్ నాని విలక్షణ దర్శకుడు విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం "గ్యాంగ్ లీడర్". ఈ సినిమా మొదలెట్టినప్పటి నుండి ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మనం, అఖిల్ హలో సినిమా తర్వాత విక్రమ్ కె కుమార్ తెలుగులో చేస్తున్న సినిమా "గ్యాంగ్ లీడర్". జెర్సీ సినిమాతో సెన్సిబుల్ విజయాన్ని అందుకున్న నాని  మరో కొత్త కథతో మన ముందుకి రాబోతున్నాడు.


ఓ బాలిక, వృద్ధురాలితో కలిపి ఐదుగురు స్త్రీలు కలిగిన నాని “గ్యాంగ్ లీడర్ ” ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. తన గ్యాంగ్ ఇదేనంటూ నాని ఆసక్తి రేపాడు. నిన్న మరో ఇంట్ర్రెస్టింగ్ వార్తతో ఆ ఆసక్తిని ఇంకా పెంచాడు.   టీజర్ డేట్ ప్రకటిస్తూ నాని మరో పోస్టర్ ని విడుదల చేసారు. ఓ లైబ్రరీలో కుర్చీలో చేతిలో పెన్సిల్ తో నాని కూర్చొని ఉన్నాడు. ఆసక్తి కరంగా ఆయన “పెన్సిల్ ని అతని గ్యాంగ్ ని 24న కలవండి, వాళ్లు చాలా ఫన్ అందించబోతున్నారు.


 పెన్సిల్ అనేది నా పెన్ నేమ్, గ్యాంగ్ లీడర్ టీజర్ 24 వ తేదీ ఉదయం 11గంటలకి విడుదల” అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.నాని పెట్టిన ఈ పోస్ట్ తరువాత అసలు ఈ పెన్సిల్ ఎవరు?, ఈ పెన్సిల్ కథేమిటీ అనే అనుమానాలు కలుగకమానవు. కనీసం టీజర్ లో నైనా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుందేమో చూడాలి. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాలో విలన్ గా యంగ్ హీరో కనిపించబోతున్నాడు.


ఆర్ ఎక్స్ 100 సినిమాతో విజయం సాధించిన కార్తికేయ ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడు. హిప్పీ సినిమాతో పరాజయం చవి చూసిన కార్తికేయకి ఈ సినిమాతో ట్రాక్ లో పడతాడెమో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టులో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: