క్యాస్టింగ్ కోచ్ వివాదాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని గత కొంతకాలంగా షేక్ చేస్తూనే ఉంది. ఈ వివాదాల పై ఇప్పటికే అనేకమంది హీరోలు హీరోయిన్స్ దర్శకులు తమ అభిప్రాయాలను చెపుతున్నారు. అయితే ఇప్పుడు ఈవిషయం ఈవారం విడుదల కాబోతున్న ‘డియర్ కామ్రేడ్’ మూవీ కథ విషయంలో చాల తెలివిగా ఇరికించినట్లు తెలుస్తోంది. 

వాస్తవానికి క్యాస్టింగ్ కోచ్ వేధింపులు ఒక్క ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా అనేక రంగాలలో మహిళకు ఎదురౌతోంది. ఉద్యోగాలు చేసే చోట మహిళకు ఈ విషయమై ఎదురయ్యే వేధింపులు సినిమా హీరోయిన్స్ బయటపెట్టినంత ధైర్యంగా బయటపెట్టలేకపోతున్నారు. 

ఈ విషయాలు అన్నీ దృష్టిలో పెట్టుకుని దర్శకుడు భరత్ కమ్మ ప్రస్తుతం కుదిపేస్తున్న క్యాస్టింగ్ కోచ్ వివాదాన్ని రష్మిక పాత్రలో చాల తెలివిగా మిక్స్ చేసి చూపించినట్లు టాక్. ఈమూవీలో రష్మిక క్రికెటర్ గా నటిస్తోంది. ఈ సందర్భంలో ఆమెకు తన క్రికెట్ కోచ్ నుండి ఎదురైనా లైంగిక వేధింపులను చాల సహజంగా ప్రస్తుత పరిస్థితులకు ప్రతిబింబించేలా దర్శకుడు తీసినట్లు సమాచారం. 

స్టూడెంట్ యూనియన్ పాలిటిక్స్ తో పాటు క్యాంపస్ రాజకీయాలు క్రికెట్ రాజకీయాలు అన్నీ వాస్తవంగా చూపెడుతూ ఆ విషయాల మధ్య విజయ్ రష్మికల మధ్య ఒక లవ్ ట్రాక్ స్టోరీని క్రియేట్ చేసి వాస్తవ పరిస్థితులను ఒక లవ్ స్టోరీ రూపంలో ఈమూవీలో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈమూవీలో వాస్తవ సంఘటనలకు సరి సమానంగా ఎమోషన్ సీన్స్ ను కూడ జత చేయడంతో ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ చేసే విషయంలో పొరపాటు జరిగితే మాత్రం ఈమూవీకి పెను ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే అలా జరగకుండా దర్శకుడు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ‘డియర్ కామ్రేడ్’ సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి..  
 


మరింత సమాచారం తెలుసుకోండి: